TG Ration Card Update: కొత్త రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. ఆ రోజు నుంచే కార్డుల జారీ!

Minister Uttam Kumar Reddy Announcement On New ration Cards In Telangana: సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ వేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సంక్రాంతి తర్వాత కొత్త కార్డులు అందజేస్తామన్నారు. దాదాపు 36లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రస్తుతం అందించే 6 కిలోలతో పాటు 6 కిలోలతో పాటు సన్నబియ్యం అందజేస్తామన్నారు. కాగా, అంతకుముందు సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులపై సరైన సమాధానం ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు.

కాగా, అంతకుముందు సర్పంచ్‌ల పెండింగ్ నిధులపై ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నించారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ప్రతి నెల రూ.270కోట్లు విడుదల చేసిన తర్వాత బకాయిలు ఉంటాయా? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిందని, ఫిబ్రవరిలో సర్పంచ్‌ల పదవికాలం పూర్తయిందని గుర్తు చేశారు. ఒకవేళ బకాయిలు ఉంటే ఒక నెలకు సంబంధించినవి మాత్రమే ఉంటాయన్నారు. కానీ, ప్రతి నెల ఇచ్చామని చెబుతున్నారని, ఒకవేళ రూ.270కోట్లు ఇచ్చి ఉంటే ఇంకా బకాయిలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు.

సర్పంచ్‌ల ఆత్మహత్యలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని, వాళ్లకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని వెల్లడించారు. బకాయిలను కాంగ్రెస్ నెత్తిపై పెట్టారని, వాటిని ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వస్తున్నామన్నారు. గత ప్రభుత్వం బకాయిలు ఇవ్వకుండా వెళ్లిందో వాటిని పూర్తి చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నాయకులు కావాలనే సభను తప్పు దారి పట్టించి రాజకీయాల ఉద్దేశంతో వారి పరపతిని పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.