Site icon Prime9

Minister Ponnam Prabhakar: ఆటో కార్మికులకు గుడ్ న్యూస్.. అందరికీ రూ.12వేలు

Minister Ponnam Prabhakar fire on BRS MLA’s: ఆటో కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆటో కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.12వేలు ఇవ్వనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నారు. అందుకే ఈ ఏడాది ఇవ్వలేకపోతున్నామని చెప్పారు.

అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం కొంతమంది అసెంబ్లీకి ఆటోలో వచ్చారు. మరికొంతమంది ఏకంగా ఆటో నడుపుతూ వచ్చారు. వీరంతా ఆటో వేషధారణలో అసెంబ్లీకి రావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆటో కార్మికులపై బీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీరు కారుస్తుందన్నారు. ఆటో కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆుకుంటుందని పేర్కొన్నారు.

బస్టాండ్ వరకే బస్సు పోతుందని, బస్సు ప్రయాణికుల ఇంటి వద్దకు వెళ్లడం లేదన్నారు. ప్రయాణికులు బస్టాండ్ నుంచి ఇళ్లకు, అక్కడి నుంచి బస్టాండ్ వద్దకు ఆటోల్లోనే వెళ్తున్నారని చెప్పారు. అంతేకానీ మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే ఆటోలపై ప్రభావం పడిందనే ఆరోపణలు తప్పు అని వివరించారు.

అయితే, బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామా ఆడుతోందని విమర్శలు చేశారు. ఆటో కార్మికులు వేసుకునే దుస్తులు ధరించి అసెంబ్లీకి రావడం, మంగళవారం కూడా బేడీలతో రావడం రాజకీయ డ్రామా అంటూ విమర్శించారు. ఇలాంటి చేయవద్దని హెచ్చరించారు. కార్మికుల కోసం గత పదేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. ఆటో కార్మికులను తీసుకొని వస్తే వారితోనే సమస్యలపై చర్చిస్తామని వివరించారు.

Exit mobile version