Site icon Prime9

Megastar Chiranjeevi : “బలగం” మూవీ టీంని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి..

megastar chiranjeevi appreciated balagam movie team

megastar chiranjeevi appreciated balagam movie team

Megastar Chiranjeevi : కమెడియన్ గా సుపరిచితుడైన వేణు టిల్లు తెరకెక్కించిన చిత్రం ‘బలగం’. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్‌ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెరపై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నిర్మించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని దిల్ రాజు దగ్గర ఉండి చూసుకున్నాడు. ఇక మూవీలో కావ్య కళ్యాణ్‌ రామ్‌ హీరోయిన్‌గా నటించింది. భీమ్స్ సిసిరోలియో స్వరాలు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. ఈ సినిమాకు అన్ని వైపుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంత బాగా సినిమా చేసి మాకు షాక్ లు ఇస్తే ఎలా అంటూ? – (Megastar Chiranjeevi)

తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా బలగం చిత్ర బృందాన్ని అభినందించారు. తాను నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమా సెట్ లో.. ఈ రోజు బలగం టీమ్ ను చిరంజీవి సన్మానించారు.  సినిమాను చక్కగా రూపొందించావంటూ డైరెక్టర్ వేణుకు అభినందనలు తెలిపారు. ‘ఇంత బాగా సినిమా చేసి మాకు షాక్ లు ఇస్తే ఎలా?’ అంటూ నవ్వులు పూయించారు. అలానే చిరు మాట్లాడుతూ.. ‘‘నిజాయతీ ఉన్న సినిమా ఇది. కమర్షియల్ ప్రొడ్యూసర్ ఉన్నప్పటికీ సినిమాకు నువ్వే పూర్తి న్యాయం చేశావు. తెలంగాణ సంస్కృతిని వంద శాతం చూపించావు’’ అని చిరంజీవి ప్రశంసించారు. వేణు గతంలో జబర్దస్త్ షోలో చేసిన స్కిట్ చూశానని, అతడిలో ఇంత టాలెంట్ ఉందా? అనిపించిందని, ఒగ్గు కథలు వంటివి బాగా చేశాడని ప్రశంసించారు. ఈ సినిమా తర్వాత అతడిపై గౌరవం మరింత పెరిగిందని చిరంజీవి చెప్పారు. ఈ సినిమా చూశాక తన టాలెంట్ ను మరోసారి నిరూపించుకున్నాడని అనిపించిందని చెప్పారు.

 

కాగా ఇందుకు సంబంధించిన వీడియోను దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ పోస్ట్ చేసింది. ఆ వీడియోని నటుడు ప్రియదర్శి రీట్వీట్ చేశారు. ‘‘చిరంజీవి అన్నయ్యా.. మీ సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను. అలాంటిది ఈ రోజు మీ పక్కన నిల్చొని మీ ప్రేమను, మద్దతును పొందడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. బలగం సినిమా కోసం మీరు చేసిన ప్రతి దానికి ధన్యవాదాలు. ఏదో ఒక రోజు మీతో కలిసి పని చేస్తానని ఆశిస్తున్నా’’ అని రాసుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్‌ రిలీజ్‌ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ దక్కించుకుంది. కాగా ఏప్రిల్‌ మొదటి వారం నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version