Site icon Prime9

Bhola Shankar : మే డే కానుక ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్” మూవీ టీమ్..

megastar chiranjeeevi posters released from Bhola Shankar team as may day gift

megastar chiranjeeevi posters released from Bhola Shankar team as may day gift

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి.. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అదే జోష్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’ కోసం మెగా ఫ్యాన్స్‌తో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మెహర్ రమేష్ అత్యంత ప్రెస్టీజియస్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులను ఈ సినిమాపై ఫోకస్ పెట్టేలా చేస్తోంది చిత్ర యూనిట్. తాజాగా మే డే సందర్భంగా భోళాశంకర్ మూవీ నుండి కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్స్‌లో వింటేజ్ లుక్‌లో చిరంజీవి ఓ టాక్సీ డ్రైవర్‌గా మనకు కనిపిస్తున్నాడు. దీంతో ఈ సినిమాలో ఆయన పాత్రకు సంబంధించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. భోళాశంకర్ మూవీలో చిరు పాత్రను గతంలో వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ భాషా మూవీతో పోలుస్తున్నారు. ఇక ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ మూవీ వేదాలంకు రీమేక్‌గా తీసుకొస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరో చెల్లి పాత్రలో నటిస్తోంది. మరి భోళాశంకర్ కూడా భాషా సెంటిమెంట్ మనకు కనిపిస్తుందా అనేది చూడాలి. ఇందులో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్‌ నటిస్తుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

నిజానికి ఈ భోళా శంకర్ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ.. షూటింగ్ జాప్యం అవ్వడంతో వాయిదా వేయక తప్పలేదు. కొత్త రిలీజ్ డేట్‌ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. భోళా శంకర్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సెట్‌లో చిరంజీవితో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్న ఓ సాంగ్ షూట్ జరుగుతోంది. ఈ పాటను భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు కొరియోగ్రఫీని శేఖర్ మాస్టర్ చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version