Site icon Prime9

Mega Daughter In Law Upasana : అరుదైన ఘనత దక్కించుకున్న మెగా కోడలు ఉపాసన..

Mega Daughter In Law Upasana got place in most-promising-business-leaders-of-asia

Mega Daughter In Law Upasana got place in most-promising-business-leaders-of-asia

Mega Daughter In Law Upasana : మెగా కోడలు, మెగా పవర్ స్టార్ సతీమణి ఉపాసన  విశిష్ట ఘనతను దక్కించుకుంది. ఎకనామిక్ టైమ్స్ రూపొందించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసనకు స్థానం లభించింది. ఆసియా స్థాయిలో 2022-23 సంవత్సరానికి గాను ఈ జాబితా ప్రకటించారు. ఓ కార్యక్రమంలో ఉపాసన పేరును అధికారికంగా వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉపాసన అందిస్తున్న సేవలు, రాణిస్తున్న తీరుకు గుర్తింపుగా ఆమె పేరును జాబితాలో చేర్చినట్టు ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది.

ఒక వైపు తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూనే.. మరోవైపు సినిమాలతో బిజీగా ఉంటోన్న భర్తకు అండగా ఉంటుంది. అలాగే అపోలో హాస్పిటల్‌ చైర్మన్‌ సి. ప్రతాప్‌ రెడ్డి మనవరాలిగా, ఆయన వార సత్వాన్ని నిలబెడుతూ వైద్య రంగంలో తన దైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే ‘బి పాజిటివ్’ అనే హెల్త్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్విస్తోంది. ఇలా సేవా రంగంలో తనదైన శైలిలో దూసుకెళుతోన్న ఉపాసనకు ప్రతిష్ఠాత్మక అవార్డు రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

 

త్వరలోనే అమ్మా – నాన్నలు కాబోతున్న చరణ్ – ఉపాసన (Mega Daughter In Law Upasana)..

కాగా దీనిపై తాజాగా ఉపాసన స్పందించారు. ఆసియా మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ లో ఒకరిగా తనను గుర్తించినందుకు ఎకనామిక్ టైమ్స్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. దీంతో మెగా అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్లు మెగా కోడలిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు త్వరలోనే అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందనున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చెర్రీ. ఆర్‌సీ 15 (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌ పూర్తయింది.

 

Exit mobile version