Site icon Prime9

Dhamaka : బాక్సాఫీస్ వద్ద మోత మోగించిన రవితేజ… ధమాకా @ 100 కోట్లు

Dhamaka

Dhamaka

Dhamaka : మాస్ మహారాజా రవితేజ యొక్క తాజా సంచలనం ధమాకా రెండు వారాల్లో 100 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. ఇది రవితేజ కెరీర్ లో అత్యధిక గ్రాసర్ కావడం విశేషం. ధమాకా అతని మొదటి 100 కోట్ల గ్రాసర్.. ఈ సినిమా రూ.100 కోట్లు+ గ్రాస్‌ సాధించినట్లు చిత్రబృందం వెల్లడిస్తూ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ మూవీ విడుదలైన ఐదు రోజుల్లో 49 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. ఆరవ రోజు ఆ 50 కోట్లకు చేరుకుంది. తరువాత 50, 85, 92 కోట్లు సాధిస్తూ 100 కోట్ల క్లబ్ లోకి చేరుకుంది. సాధారణంగా వీకెండ్ తర్వాత సినిమా కలెక్షన్స్ డల్ అవుతాయి. . కానీ ధమాకా మూవీ మాత్రం రోజురోజుకూ కలెక్షన్స్ సాధిస్తూ దూసుకెడుతోంది.

రవితేజకు క్రిస్మస్ సీజన్ మాత్రమే కాకుండా న్యూ ఇయర్ లాంగ్ వీకెండ్ కూడా బాగా కలిసి వచ్చింది.అలాగే పోటీగా మరో సినిమా లేకపోవడంతో ఈయన ఇప్పుడు ఏకంగా 100 కోట్లు వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. మాస్ మరియు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ల విషయానికి వస్తే రవితేజ అతిపెద్ద స్టార్‌లలో ఒకరని ధమాకా విజయం రుజువు చేస్తుంది.

Exit mobile version