Site icon Prime9

Telangana: తెలంగాణాలో మావోయిస్టులు యాక్టివ్ అవుతున్నారు….మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు

Maoists are becoming active in Telangana

Maoists are becoming active in Telangana

Maoists: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతికి అడ్డులేకుండా పోయిందని, దీన్ని మావోయిస్టులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని, ఒక విధంగా అధికార పార్టీ తీరుతో తెలంగాణాలో మావోలో జాడ మళ్లీ కనపడుతుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు కలకలం వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని కోల్డ్ బెల్ట్ ఏరియాలో టీఆర్ఎస్ పార్టీ నేతల అవినీతి వ్యవహరంలో గోనె ఈ మాటలు పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్ధితిల్లో నాకు ఓపిక ఉంటే ఒక్క రోజులో వంద మంది మావోలను తయారు చేసే వాడినని గోనె మరో బాంబు పేల్చారు. ఒకప్పుడు మావోయిస్టుల ఎజెండానే మా ఎజెండా అన్న సీఎం కేసిఆర్ రాష్ట్రంలో మావోల ఊసలేకుండా చేయడాన్ని తప్పుబట్టారు. అనేక ఉద్యమాల్లో మావోల పాత్రకు చరిత్ర ఉందన్నారు. మావోయిస్టుల కదలికలు నాకు తెలుసునంటూ గోనె ప్రకాష్ రావు మరో అడుగు ముందుకేసి మరీ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీపై నిషేదం ఉన్న సమయంలో ఏనాడు వారితో సంబంధాలు లేని గోనె ప్రకాష్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

మరోవైపు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని మావోయిస్ట్ పార్టీ కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ డిమాండ్ చేసివున్నారు. సింగరేణి కాలరీస్ లో విప్లవ కార్మిక సంఘాలు పట్టుకోల్పోయాయి. నిషేధిత మావో సంస్ధలకు అనుభందంగా ఐఎఫ్ టీయి, సింగరేణి గని కార్మిక సంఘాలు, సికాస లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. గడిచిన 22 సంవత్సరాలుగా సింగరేణిలో తిరుగులేని శక్తిగా, కార్మిక వర్గంలో పట్టుకల్గిన వారిలో చాలామంది ఎన్ కౌంటర్లలో, అరెస్ట్ లతో గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి:Hyderabad Traffic: నేటినుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్

Exit mobile version