Site icon Prime9

Mammootty : మమ్ముట్టి ఇంట మరో విషాదం.. తుదిశ్వాస విడిచిన ఆయన సోదరి అమీనా

mammootty sister ameena passed away due to health issues

mammootty sister ameena passed away due to health issues

Mammootty : మలయాళంలో స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్న మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే. స్వాతి కిరణం, యాత్ర వంటి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించారు. ఇటీవలే అక్కినేని అఖిల్‌ నటించిన ఏజెంట్‌లోనూ మెరిశారు. అయితే ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ వయసులో కూడా మమ్ముట్టి.. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కాగా ఇటీవలే కొన్ని నెలల క్రితం మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ 93 ఏళ్ళ వయసులో మరణించారు. దీంతో మమ్ముట్టి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.

ఈ విషాదం నుంచి మమ్ముట్టి కుటుంబం తెరుకునే లోపే వారి ఇంట మరో విషాదం నెలకొంది. మమ్ముట్టి సోదరి అమీనా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఇవాళ ఉదయం అమీనా కన్నుమూశారు. 70 ఏళ్ళ వయసులో ఆవిడ మరణించారు. దీంతో మరోసారి మమ్ముట్టి కుటుంబం విషాదంలో మునిగింది. తల్లి మరణించిన కొన్నాళ్లకే సోదరి కూడా మరణించడంతో మమ్ముట్టి తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ మేరకు ఆయనకు పలువురు మలయాళ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

 

Exit mobile version