Site icon Prime9

Actress Aparna Nayar : మళయాళ నటి అపర్ణా నాయర్ అనుమానాస్పద మృతి.. షాక్ లో మాలీవుడ్ !

malayali actress aparna nayar died and investigation goes on

malayali actress aparna nayar died and investigation goes on

Actress Aparna Nayar : ప్రముఖ మళయాళ నటి అపర్ణా నాయర్ మృతి చెందారు. తిరునంతపురంలోని తన నివాసంలో ఉరివేసుకుని కనిపించినట్లు పోలీసులు చెబుతున్నారు. అనుమానాస్పద రీతిలో ఆమె మృతి చెందడం పట్ల అందరూ షాక్ కి గురవుతున్నారు. అపర్ణ తన భర్త, పిల్లలతో కలిసి ఉంటున్నారు.

అపర్ణ పలు సూపర్ హిట్ సీరియళ్లలో నటించి పేరు తెచ్చుకున్న అపర్ణ నాలుగైదు సినిమాల్లోనూ నటించారు. ఆమె ఆత్మహత్య విషయం తెలిసి ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. అయితే గురువారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తన నివాసంలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. అపర్ణ మరణంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు ఆమె మరణంతో మళయాళ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. పలువురు నటీనటులు ఆమె మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సమస్యలే ఆమె మృతికి కారణం అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కాగా, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అపర్ణ ఆత్మహత్యకు 11 గంటల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు కూడా పెట్టడం గమనార్హం.

Exit mobile version