Site icon Prime9

Sanjay Raut: మహారాష్ట్ర ఎన్నికల్లో సంచలనం.. కాంగ్రెస్‌లోకి సంజయ్ రౌత్..?

Maharashtra minister Nitesh Rane says Sanjay Raut in talks to join Congress: శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ త్వరలో పార్టీని వీడనున్నారని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీశ్‌ రాణే వ్యాఖ్యానించారు. ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, ఢిల్లీలోని ఒక నేతతో సంజయ్ రౌత్ సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు.

ముగియనున్న రాజ్యసభ సభ్యత్వం..
సంజయ్‌ రౌత్‌ రాజ్యసభ పదవి కాలం ముగిసే సమయం ఆసన్నమైందన్నారు. ఈసారి ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నుంచి నేతలు విజయం సాధించడం కష్టమేనని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాలు మాత్రమే గెలుచుకుందన్నారు. పార్టీ భవిష్యత్ గురించి అర్థం చేసుకున్న సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారన్నారు. అందుకోసం ఢిల్లీలోని ఓ నాయకుడితో సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి నితీశ్ రాణే ఆరోపించారు.

అధికారికంగా ప్రకటించాలి..
‘రౌత్‌ ఇంకా ఎంతకాలం పార్టీలో కొనసాగుతారు..? కాంగ్రెస్‌లో చేరేందుకు ఢిల్లీలో చర్చలు జరుపుతున్న నేత గురించి ఉద్ధవ్‌ పార్టీ ‘సామ్నా’లో రాయాలి. సంజయ్‌ రౌత్‌ కూడా తన ఉద్దేశాన్ని అధికారికంగా ప్రకటించాలి’ అని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే మధ్య విభేదాలు ఉన్నాయని.. ఇది రాష్ట్ర ప్రజలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఇటీవల సామ్నాలో సంజయ్‌ పేర్కొన్నారు. శిందే సీఎం పదవి కోసం పోరాడుతున్నారని, ఈ విషయంపై ఇరువురి మధ్య విభేదాలు తలెత్తాయంటూ ఆరోపించారు. తాజాగా మంత్రి నితీశ్ రాణే ఆరోపణలను ఖండించారు. అనంతరం సంజయ్‌ రౌత్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇదిలా ఉండగా, నితీశ్ రాణా వ్యాఖ్యల వెనుక సంజయ్ రౌత్ ‘సామ్నా’లో రాసిన సంపాదకీయమే కారణం కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఇటీవల సంజయ్ రౌత్ సామ్నా సంపాదకీయంలో ఇలా రాసుకొచ్చారు. ‘దేవేంద్ర ఫడ్నవిస్, శివసేన నేత ఏక్ నాథ్ షిండేకు మధ్య సంబంధాలు చిక్కుల్లో పడేశాయని.. తద్వారా రాష్ట్ర ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపాయి’ అని రాశారు.

Exit mobile version
Skip to toolbar