Site icon Prime9

Maharashtra Cabinet Expansion: రేపు ’మహా‘మంత్రివర్గ విస్తరణ

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే కేబినెట్‌ విస్తరణ రంగం సిద్దం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ర్ట అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరుగనుంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ లభించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాగా ముఖ్యమంత్రి షిండే అధికార పర్యటనకు నాందేడ్‌ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొత్త మంత్రుల పేర్లు ఈ రోజు రాత్రి కానీ, రేపు ఉదయం కానీ ఖరారు చేస్తానని చెప్పారు.

బీజేపీ నుంచి రాధాకృష్ణ వీకీ పాటిల్‌, చంద్రకాంత్‌ పాటిల్‌, గిరిష్‌ మహాజన్‌, సుధీర్‌ ముంగటివార్‌లకు బెర్త్‌లు దక్కే అవకాశాలున్నాయి. అలాగే షిండే గ్రూపు నుంచి ఉదయ్‌ సామంత్‌, దాదా బుసే, సందీపన్‌ బుమ్రే, సంజయ్‌ షిరాస్ట్‌, గులాబ్‌రావు పాటిల్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

Exit mobile version