Site icon Prime9

Rajasthan Lumpy disease outbreak: రాజస్థాన్‌లో చర్మవ్యాధి కలకలం.. 2,500 పైగా పశువుల మృతి

Rajasthan: రాజస్థాన్‌లోని తొమ్మిది జిల్లాల్లో లుంపి చర్మవ్యాధి కారణంగా 2,500 పైగా పశువులు మరణించడంతో పాడిరైతులు ఆందోళన చెందుతున్నారు. వైరల్ వ్యాధి కారణంగా 2,500 పశువులు చనిపోగా, మరో 50,000 పశువులకు సోకింది. వైరల్ ఇన్‌ఫెక్షన్ ఇప్పటికే తొమ్మిది జిల్లాలకు వ్యాపించింది. ఎక్కువగా గుజరాత్‌కు ఆనుకుని వున్న జిల్లాల్లో ఎక్కువగా వ్యాపిస్తోందని పశుసంవర్దకశాఖ అధికారులు తెలిపార.

బార్మర్, జలోర్, జోధ్‌పూర్, బికనీర్, పాలి, గంగానగర్, నాగౌర్, సిరోహి మరియు జైసల్మేర్‌ జిల్లాల్లో పశువులు ఎక్కువగా మరణించాయి.ఈ వ్యాధికి వ్యాక్సినేషన్ అందుబాటులో లేదు, ఇది లక్షణాల ఆధారంగా చికిత్స చేయబడుతోందికేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు మరియు వెటర్నరీ వైద్యుల బృందం సోమవారం జోధ్‌పూర్ మరియు నాగౌర్‌లను సందర్శించి పరిస్థితిని సమీక్షించింది. ఈ బృందం గంగానగర్, హనుమాన్‌ఘర్, బికనీర్, జలోర్, బార్మర్, జైసల్మేర్, పాలి మరియు సిరోహిలను కూడా సందర్శిస్తుందని సీనియర్ అధికారులు తెలిపారు.గుజరాత్ సరిహద్దుకు ఆనుకుని ఉన్నదుంగార్‌పూర్, బన్స్వారా, ఉదయ్‌పూర్, రాజ్‌సమంద్ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు.

ఈ వైరల్ వ్యాధి రక్తం పీల్చే కీటకాలు, కొన్ని రకాల ఈగలు మరియు కలుషితమైన ఆహారం మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన జ్వరం, కళ్ళు మరియు ముక్కు నుండి స్రావాలు, లాలాజలం, శరీరం అంతటా మృదువైన పొక్కులు, పాల దిగుబడిలో గణనీయమైన తగ్గుదల మరియు తినడం కష్టంగా మారుతుంది.

Exit mobile version
Skip to toolbar