Vizag Building Collapse : విశాఖపట్నంలోని కలెక్టరేట్ సమీపంలో గల రామజోగి పేటలో మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో భవన శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. కాగా ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న మరో ఆరుగురిని స్థానికులు, రెస్క్యూ సిబ్బంది రక్షించి కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
ఆ కారణంగానే బిల్డింగ్ కూలిందా (Vizag Building Collapse)..?
చనిపోయిన వారిని సాకేటి అంజలి(15), దుర్గప్రసాద్(18), బీహార్ కు చెందిన చోటు(26)గా గుర్తించారు. మరోవైపు గాయపడిన వారిని చికిత్స కోసం విశాఖ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఆర్డీవో హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై ఆరా తీశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. అటు డీసీపీ గరుడ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు పురాతన భవనం అవ్వడం వల్లనే కూలినట్టు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. మృతురాలు చిన్నారి అంజలి నిన్ననే (బుధవారం) పుట్టినరోజు జరుపుకున్నారు. పుట్టిన రోజు జరుపుకున్న మరుసటి రోజే చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. భవనం కూలిపోయే సమయంలో అందులో తొమ్మిది మంది ఉన్నట్లు తెలుస్తోంది.
గ్రౌండ్ ఫ్లోర్..
- కొమ్మిశెట్టి శివశంకర్ సన్నాఫ్ నాగేశ్వరరావు. వయసు 29 సంవత్సరాలు.
- చోటు బిహార్ కి చెందిన వ్యక్తి కూడా ఉంటున్నాడు
ఫస్ట్ ఫ్లోర్..
- సాకేటి రామారావు సన్నాఫ్ గురువులు. వయసు 39 సంవత్సరాలు.
- సాకేటి కళ్యాణి వైఫ్ ఆఫ్ రామారావు.
- సాకేటి దుర్గాప్రసాద్ సన్నాఫ్ రామారావు. ఈ యువకుడు ఇంటర్మీడియట్ సెకండియర్ ఆచారి కాలేజీలో చదువుతున్నాడు.
- సాకేటి అంజలి D/o రామారావు, రామకృష్ణ మిషన్ స్కూల్లో 10 వ తరగతి చదువుతుంది.
సెకండ్ ఫ్లోర్..
- సన్నాపు కృష్ణ సన్నాఫ్ నాగేశ్వరరావు (late), వయసు 30 సంవత్సరాలు.
- పాతిక రోజా రాణి వైఫ్ ఆఫ్ కృష్ణ వయసు 29 సంవత్సరాలు.