KTR: తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్ష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం హిమాన్షు రావు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నాడు. సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక, సృజనాత్మక అంశాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు హిమాన్ష్ రావు. తన స్కూల్‌లో ఇటీవలే నిర్వహించిన కాస్నివాల్‌కు ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. దాని ద్వారా వచ్చిన ఆదాయంతో ఖాజాగూడ కొత్తచెరువును అభివృద్ధి చేస్తామన్నారు. అయితే తాజాగా తన లోని టాలెంట్ ని బయటపెట్టాడు హిమాన్షు.
హాలీవుడ్ పాప్ స్టార్ జేవీకేయి పాడిన గోల్డెన్ అవర్ సాంగ్ ని హిమాన్షు తన గొంతుతో ఆలపించాడు. ఈ పాటకు సంబంధించిన వీడియోను హిమాన్షురావు ‘గోల్డెన్ అవర్ X హిమాన్షు కవర్’ పేరుతో తన యూట్యూబ్‌లో ఛానెల్‌లో షేర్ చేశారు. ఈ సాంగ్‌పై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. అచ్చం జాకబ్ లాసన్‌ను తలపించేలా అతను ఈ కవర్ సాంగ్ పాడాడని సాంగ్ ఎంతో అద్భుతంగా ఉందంటున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ సాంగ్ వైరల్ గా మారింది. హిమాన్షుకు మంచి సింగర్ అయ్యే లక్షణాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కేటీఆర్(KTR) ఫిదా
దీంతో తాజాగా ఈ సాంగ్ పై కేటీఆర్(KTR) కూడా స్పందించారు. తనయుడి సాంగ్‌తో ఫిదా అయిన కేటీఆర్.. కొడుకును చూస్తుంటే గర్వంగా ఉందన్నాడు. ఈ సాంగ్ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ‘ప్రౌడ్ అండ్ ఎగ్జైటడ్ ఫర్ మై సన్’ అని కామెంట్ చేశారు కేటీఆర్. అందుకు థ్యాంక్యూ డాడీ అంటూ తండ్రి ట్వీట్‌కు హిమాన్షు రావు రిప్లై ఇచ్చారు. అటు దీనిపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. కవిత కూడా అల్లుడి సాంగ్‌కి ముచ్చటపడ్డారు.
అల్లుడూ.. నువ్వు సూపర్, అదరగొట్టేశావ్ అంటూ హిమాన్షుని మెచ్చుకున్నారు కవిత. తన మేనల్లుడు పాడిన పాట అదుర్స్ అంటూ ఆమె ట్వీట్ చేశారు. తన అల్లుడు కల్వకుంట్ల హిమాన్షు పాడిన పాట తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. గాడ్ బ్లెస్ యు అంటూ తన అల్లుడిని దీవించారు కవిత. ‘అల్లుడు నీ పాట బాగుంది. నిన్ను చూసి గర్వపడుతున్నా. నీ నుంచి ఇలాంటి అందమైన సంగీతం వినడానికి వేచి ఉన్నా’ అని ట్వీట్ చేశారు కవిత. ప్రస్తుతం ఈ సాంగ్‌పై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.