Site icon Prime9

TG Assembly: అసెంబ్లీలో రగడ.. హరీశ్‌రావు వర్సెస్ కోమటిరెడ్డి

Komatireddy vs Harish Rao in TG Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నేడు అసెంబ్లీలో భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. బుధవారం అసెంబ్లీలో భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని విపక్షాలు కోరాయి.

ఇదిలా ఉండగా, అసెంబ్లీలో గురువారం నల్లొండ నీటి విషయంపై చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాల సమయంలో తొలుత సభ్యులు నల్గొండ జిల్లాలో మూసీ నీటిపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి నల్గొండ జిల్లాలోని నీటి సమస్యలు క్షుణ్ణంగా వివరించారు. ఈ సమస్యలపై ఎమ్మెల్యే హరీష్ రావు కలుగజేసుకుని మాట్లాడారు. ఒక మంత్రి నిల్చుని మరో మంత్రిని ప్రశ్నలు అడిగితే ఇంకా ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. క్వశ్చన్ అవర్‌లో హరీష్ రావు ఏ హోదాలో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
ఈ విషయంపై  మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య వాడీవేడి సంభాషణ సాగింది. హరీష్ రావుపై కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు.. డిప్యూటీ లీడర్‌నా? ఎమ్మెల్యేనా? ఏ హోదాలో మాట్లాడుతున్నారని అన్నారు. ఈ విషయంలో ఆయనకు అడిగే హక్కు లేదన్నారు.

ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం సభకే కాదు.. తెలంగాణ ప్రజలకు అవమానపరచడమే కోమటిరెడ్డి అన్నారు. నల్గొండ ప్రజల కడుపులో ఆవేదన ఎలా ఉంటుందో చెప్పానన్నారు. డబ్బున్న వాళ్లు హైదరాబాద్ వచ్చారని, లేనివాళ్లు అక్కడే ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అయితే హరీష్ రావుకు నల్గొండ గురించి కానీ వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడే హక్కు లేదని కోమటి రెడ్డి ఫైర్ అయ్యారు.

Exit mobile version