Kodi Pandalu: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ వాతావరణం మొదలైంది. ఏపీ, తెలంగాణాల్లో సంక్రాంతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక ముందుగా సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది. భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, డుడూ బసవన్నలు, ఆటలు, హరిదాసు కీర్తనలు, ఆడ పడుచుల సంబరాలు ఇలా వీటన్నింటి మధ్యలో పోటా పోటీగా కోడి పందాలు నిర్వహిస్తూ ఉంటారు. సంక్రాంతిని పురస్కరించుకొని గ్రామాల్లో కోడి పందాల జరుగుతూ ఉంటాయి. పండగకు కొన్ని నెలల ముందు నుంచే కోడి పందాలకు సన్నద్ధం అవుతుంటారు. కోడి పందాలకు లక్షల్లో ఖర్చు ఉంటుంది. కోళ్లకు పెట్టే ఖర్చును చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. పందెం కోళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి బారిలోకి దించుతారు.
కోడి పందాలాడితే సహించేదు- ఎస్పీ
గ్రామాల్లో అయితే కోడి పందాలను ఎంతో ప్రిస్టేజీ ఇష్యూగా తీసుకొని పోతికు దిగుతూ ఉంటారు. కాగా తూర్పుగోదావరి, రాజమండ్రి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలలో ప్రస్తుతం సంక్రాంతి కోడిపందాలపై ఉత్కంఠ నెలకొంది. అసలైన సంక్రాంతిని చూడాలంటే ఉత్తరాంధ్రలోనే చూడగలం అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం ఎవరైనా కోడి పందాలాడితే సహించేది లేదంటూ ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఎక్కడైనా కోడి పందాలాడితే ఆయా స్టేషన్ ల పరిధిలో చర్యలు తప్పవని ఏస్పీ ఆదేశాలు జర చేసినట్లు సమాచారం అందుతుంది.
ఈ నేథ్యంలో సంక్రాంతి కోడిపందాల బారులు పై అమలాపురంలో మంత్రి విశ్వరూప్ తో కోనసీమ ఎమ్మెల్యేలు సమావేశం అవుతున్నట్లు చెబుతున్నారు. ఎ
క్కడ కోడిపందాలు జరగకుండా చర్యలు చేపట్టడంపై కోనసీమ ఎమ్మెల్యేలు అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎలాగైనా కోడిపందాలు ఆడించాలని మంత్రి విశ్వరూప్ ను వైసీపీ నాయకులు కోరినట్లు సమాచారం అందుతుంది. ఈ సమావేశంలో మంత్రి విశ్వరూప్ తో పాటు ప్రభుత్వ విప్ కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మేల్సీ తోట త్రిమూర్తులు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఉన్నారని తెలుస్తుంది. అయితే సంక్రాంతి సాంప్రదాయ క్రీడలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని కోనసీమకు చెందిన మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కోడిపందాల ముసుగులో జరిగే జూదం, గుండాటలకు తాము వ్యతిరేకమంటూ వేణుగోపాల్ కృష్ణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/