Site icon Prime9

BJP leaders: తెలంగాణాతో కేసిఆర్ బంధం తెగిపోయింది

KCR's bond with Telangana has been severed

KCR's bond with Telangana has been severed

TRS to BRS:  బీఆర్ఎస్ పార్టీగా సీఎం కేసిఆర్ తీసుకొన్న నిర్ణయాన్ని భాజపా ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఖండించారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఆకాంక్షలను కేసిఆర్ తెగదెంపులు చేసుకొన్నట్లుగా పేర్కొన్నారు. కేవలం మద్యం, ప్రలోభాలు, డబ్బే ప్రధానమన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలనుకొంటున్నారని, ఇది తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనంటూ ఈటెల ఆరోపించారు.

ఈ రోజు తీసుకొన్న జాతీయ పార్టీ నిర్ణయం కేసిఆర్ కలగానే మిగిలిపోతుందా అన్న విషయంపై వేచిచూడాలన్నారు. తెలంగాణాలో నెలకొన్ని సమస్యలను తీర్చలేక, వాటిని దేశంపైన రుద్దేందుకు తీసుకొన్న చర్యలో భాగంగానే బీఆర్ఎస్ రూపుదిద్దుకొందన్నారు.

మరోవైపు భాజపా సీనియర్ నేతలు సైతం కేసిఆర్ జాతీయ పార్టీ మార్పుపై స్పందించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ బీఆర్ఎస్..వీఆర్ఎస్ తీసుకోవడం ఖాయమన్నారు. మహిళా నాయకురాలు డి.కె. అరుణ మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీగా పేర్కొన్నారు. అవనీతి సొమ్ముతో దేశం మొత్తం తిరగాలని చూస్తున్నారన్నారు. కేసిఆర్ అవనీతి భాగోతం త్వరలోనే తెలుస్తుందని అరుణ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Munugodu: కేంద్ర బలగాలతో ఉప ఎన్నికల నిర్వహించండి…ఎస్ఈసీకి భాజపా విజ్నప్తి

Exit mobile version