Kareena Kapoor Khan : నాటు నాటు.. ఆర్ఆర్ఆర్ లోని ఈ పాట సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సినీ రంగంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ని సాధించిన విషయం తెలిసిందే. తెలుగు వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇండియన్ గర్వపడేలా చేసిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. సినిమా రిలీజయి సంవత్సరం అవుతున్నా కూడా నాటు నాటు అంటూ అందరూ ఊగిపోతూనే ఉన్నారు. ఇక ఆస్కార్ గెలుచుకొని ఇండియాకు తిరిగివచ్చిన ఆర్ఆర్ఆర్ టీంకు ఇక్కడ గ్రాండ్ గా వెల్కమ్ చెబుతున్నారు. ఇక నాటు నాటు సాంగ్ ని అందరూ ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ నాటు నాటు సాంగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కరీనా హోస్ట్ గా “వాట్ ఉమెన్ వాంట్” అనే ఓ షో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో కరీనా నాటు నాటు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాటు నాటు పాట చరిత్ర సృష్టించింది. చిన్న పిల్లల మనసు సైతం ఈ పాట కొల్లగొట్టింది. నా చిన్న కొడుకు జెహ్ నాటు నాటు పాట పెడితే కానీ అన్నం తినట్లేదు. అది కూడా తెలుగులోనే వినడానికి ఇష్టపడుతున్నాడు.
జెహ్ కి ఆ పాట బాగా నచ్చింది – కరీనా కపూర్ (Kareena Kapoor Khan)
జెహ్ కి ఆ పాట బాగా నచ్చింది. ఆ పాట వినపడినప్పుడల్లా సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నాడు. ఆస్కార్ గెలిచిన పాట ప్రేక్షకులని ఎంతగా మ్యాజిక్ చేసిందో ఇదే ఉదాహరణ అని తెలిపింది. దీంతో కరీనా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నాటు నాటు పాట వినపడందే తన కొడుకు అన్నం తినట్లేదు అనడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇక చరణ్, ఎన్టీఆర్ అభిమానులు ఈ వ్యాఖ్యలని వైరల్ చేస్తున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అజయ్ దేవ్‌గన్, శ్రియా శరణ్, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. 2022 మార్చి 24న రిలీజ్ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం భారత్ లోనే కాకుండా యూఎస్, జపాన్ లోనూ ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు. అలానే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు కూడా వచ్చాయి. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి ఇటీవలే బెస్ట్ డైరెక్టర్‌గా ఆర్ఆర్ఆర్ మూవీకి రాజమౌళి అందుకున్నారు. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా అందుకుంది. ప్రస్తుతం కరీనా కపూర్ చేసిన కామనేటస్ హాట్ టాపిక్ గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.