Site icon Prime9

Shivaraj Kumar: అనారోగ్యంతో బాధపడుతున్న కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ – క్లారిటీ ఇచ్చిన హీరో

Shivarajkumar About His Health Problem: కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ తెలుగు ఆడియన్స్‌కి కూడా సుపరిచతమే. ఇప్పటి వరకు తెలుగులో సినిమా చేయకపోయి డబ్బింగ్‌, రీమేక్‌ చిత్రాలతో ఆయన ఇక్కడ గుర్తింపు పొందారు. మరికొద్ది రోజుల్లో ఆయన తెలుగు చిత్రాలతో ఇక్కడ ఆడియన్స్‌ని అలరించబోతున్నారు. ఇదిలా ఉంటే శివరాజ్‌ కుమార్‌ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ కొద్ది రోజులుగా శాండల్‌వుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తన లేటెస్ట్‌ మూవీ ‘భైరతి రంగల్‌’ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన తాను ఆరోగ్యంతో బాధపడుతున్నట్టు స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నేను ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నది నిజమే. తొలిసారి నా అనారోగ్యం గురించి తెలిసి చాలా భయపడ్డాను. కానీ ఈ విషయాన్ని నేను బయట పెట్టాలనుకోలేదు. ఎందుకంటే అభిమానులు, ప్రజలు కలవరపడటం నాకు ఇష్టం లేదు. అందుకే నా ఆరోగ్య సమస్య గురించి చెప్పలేదు. నేను సాధారణ మనిషినే. నాకు సమస్యలు వస్తుంటాయి. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనేలా ఆత్మవిశ్వాసాన్ని పొందాను. ప్రస్తుతం నేను చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు సెషన్ల ట్రీట్‌మెంట్ పూర్తయ్యింది. ఇప్పుడంతా బాగానే ఉంది. ఎవరూ ఆందోళన పడాల్సి అవసరం లేదు” అంటూ చెప్పుకొచ్చారు.

Exit mobile version