Site icon Prime9

Kantara : నిజంగా జరిగిన కాంతారా క్లైమాక్స్.. షాక్ లో రిషబ్ శెట్టి ?

kanatara team experience reel scene in real life

kanatara team experience reel scene in real life

Kantara : రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన చిత్రం “కాంతారా”. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.

కాంతార సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.

కన్నడ సహా విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగు, హిందీ భాషలలో కూడా ఈ మూవీ భారీ హిట్ అందుకుంది.

16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా 450 కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డులు తిరగరసింది.

ప్రేక్షకులే కాకుండా సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు వర్షం కురిపించారు.

హోంబలే ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం కర్ణాటకలో ప్రాచీన సంప్రదాయమైన భూతకోల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

రిషబ్‌ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఈ మూవీలోని ప్రధానంగా వరాహం సాంగ్, క్లైమాక్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

కాంతారా (Kantara) టీంకి దైవానుగ్రహం..

ఆ వీడియోలో రిషబ్‌ శెట్టి, సప్తమి గౌడతో పాటు చిత్రబృందం లోని పలువురు సభ్యులు, హోంబలే నిర్మాతలు తులునాడులో పంజర్లీ ఉత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భూతకోల ఆడటం.. ఆ తర్వాత సదరు వ్యక్తికి పంజర్లీ ఆవహించడం గమనించవచ్చు.

ఇక పంజర్లీ ఆవహించిన వ్యక్తి కాంతారా సినిమాలోని క్లైమాక్స్ లాగానే కొంతమంది వ్యక్తులకు పలు సూచనలు అందిస్తారు.

ముఖ్యంగా రిషబ్‌శెట్టిని ఆత్మీయంగా పట్టుకోవడం వీడియోలో కనిపించింది.

తెరపై చూపించిన భూతకోల సన్నివేశాలను నిజ జీవితంలోనూ రిషబ్ శెట్టి బృందం ఎదురవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దీంతో ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.

 


హోంబలే ఫిల్మ్స్ తన ట్విటర్‌ ఖాతాలో రాస్తూ.. ‘ప్రకృతికి మనం లొంగిపోయి మనకు స్వేచ్ఛ, విజయాన్ని ప్రసాదించిన దైవాన్ని ఆరాధించండి. కాంతార బృందం నిజ జీవితంలో దేవానుగ్రహాన్ని పొందింది.’ అని పేర్కొంది. కాంతార టీమ్‌తో కలిసి తాము నిజ జీవితంలో దైవానుగ్రహం పొందామని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా ఇటీవలే కాంతారా సినిమా రెండు విభాగాల్లో ఆస్కార్ కి క్వాలిఫికేషన్స్ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆస్కార్ క్వాలిఫికేషన్స్ లో మొత్తం 301 సినిమాలు వెళ్లాయి. మరి వీటిలో ఓటింగ్ తర్వాత నామినేషన్స్ లో ఎన్ని నిలుస్తాయి చూడాలి. ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ వేడుక మార్చ్ 12న జరగనుంది.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

 

Exit mobile version