Site icon Prime9

Junaid Siddique: ప్రపంచకప్‌లోనే భారీ షాట్.. సిద్దిఖి సిక్సర్ చూసి అంతా షాక్..!

junaid Siddique six

junaid Siddique six

Junaid Siddique: ప్రపంచకప్ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీసుల్లో లీనమయ్యాయి. కాగా తాజాగా టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన గ్రూప్‌-ఏ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బ్యాటర్ జునైద్‌ సిద్ధిఖి భారీ సిక్సర్ బాదాడు. ఏకంగా 109 మీటర్ల భారీ సిక్సర్‌ను బాదాడు.

శ్రీలంక బౌలర్ దుష్మంత చమీరా 16వ ఓవర్లో వేసిన రెండో బంతికి సిద్ధిఖి భారీ సిక్సర్ కొట్టాడు. దానితో బంతి గాల్లోనే చాలా సమయం ఉంటూ డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా వెళ్లి స్టేడియం బయట పడింది. ఈ భారీ సిక్సర్‌ బాదిన తర్వాత యూఏఈ బ్యాటర్ జునైద్‌ సిద్ధిఖి చేసుకున్న సెలెబ్రేషన్స్ క్రికెట్ లవర్సను ఆకట్టుకుంది. తన బలం ఇదంటూ మైదానంలోని ప్రేక్షకులకు కండలు చూపిస్తూ తెగ సంబరపడిపోయాడు. కాగా దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతోంది.
సిద్ధిఖి కొట్టిన సిక్స్ చూసిన క్రికెట్ అభిమానులందరూ షాక్ అవుతున్నారు. కాగా ఈ మ్యాచ్లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లంక చేతిలో ఓటమిని చవిచూసింది.

ఇదీ చదవండి: భారత జట్టుకు మరో షాక్.. ప్రపంచ కప్ కు పంత్ దూరం..?

Exit mobile version