Site icon Prime9

Jr Ntr : ఫ్యాన్స్ కి స్వీట్ వార్నింగ్ ఇస్తూనే నెక్స్ట్ మూవీ గురించి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..

jr ntr sweet warning to fans and reveals update on koratala siva movie

jr ntr sweet warning to fans and reveals update on koratala siva movie

Jr Ntr :  నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’.

ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

రాజేంద్ర రెడ్డి దర్శకుడు కాగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే తొలిసారి ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.

బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న ఏ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

కాగా నిన్న రాత్రి ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి కళ్యాణ్ రామ్ సోదరుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి స్వీట్ వార్నింగ్ ఇస్తూనే సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.

 

అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతున్న సందర్భంలో అభిమనులంతా ఎన్టీఆర్ 30 మూవీ అప్డేట్ గురించి ఎన్టీఆర్ ఆ విషయంపై స్పందించారు.

ఒక్కోసారి సినిమాలు చేసేటప్పుడు చెప్పడానికి ఏమి ఉండదు. ఒక అప్డేట్ ఇవ్వాలంటే చాలా కష్టం.

మీ ఆరాటం, ఉత్సాహం అర్ధమవుతుంది. కానీ ఇది నిర్మాతలు, దర్శకుల మీద ప్రెజర్ అవుతుంది.

ఏది పడితే అది అప్డేట్ ఇవ్వలేము. ఏమన్నా అప్డేట్ ఉంటే మా ఇంట్లో భార్యకంటే కూడా ముందు మీకే చెప్తాము.

అదిరిపోయే అప్డేట్ ఉంటే మాత్రమే చెప్తాము. నా పరిస్థితి మాత్రమే కాదు అందరి హీరోల పరిస్థితి ఇదే. ఇలా అప్డేట్స్ ఎవర్ని అడగకండి. ఎక్కడెక్కడో ఉన్న వార్తలు చదివి మీరు అడగొద్దు.

ఏమన్నా ఉంటే మేమె చెప్తాము అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

(Jr Ntr) ఎన్టీఆర్ 30 గురించి అదిరిపోయే అప్డేట్..

అలానే అనుకోని రీతిలో తన నెక్స్ట్ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు తారక్.

మీ అందరికోసం ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా అప్డేట్ ఇస్తున్నాను. ఫిబ్రవరిలో సినిమా స్టార్ట్ చేస్తాం. మార్చి 20 తర్వాత షూటింగ్ ప్రారంభిస్తాం. 2024 ఏప్రిల్ 5కి మూవీ రిలీజ్ చేస్తాం అని తెలిపారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.

అంతకు ముందు మాట్లాడుతూ.. నాకు ఒంట్లో బాగోలేదు, అయినా మీ కోసం వచ్చాను. ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను, కానీ మాట్లాడతాను అని చెప్పారు.

డైరెక్టర్ రాజేంద్ర గురించి మాట్లాడుతూ ఈ సినిమా సక్సెస్ అవుతుంది, మీరు సాధించిన సక్సెస్ మీ పేరెంట్స్ పైనుంచి చూస్తారని ఎన్టీఆర్ చెప్పారు.

కళ్యాణ్ అన్నయ్య రామ్ గురించి, ఆర్ఆర్ఆర్ గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఎన్టీఆర్.

కళ్యాణ్ రామ్ గురించి చెబుతూ.. యాక్టింగ్ లో నాకంటే కళ్యాణ్ అన్న సీనియర్. మా మొత్తం కుటుంబంలో ఎంతమంది నటులు ఉన్నా ప్రయోగాత్మక సినిమాలు చేసింది కళ్యాణ్ అన్న ఒక్కడే. జై లవకుశ చేశాను, మూడు రోల్స్ చేయడం చాలా కష్టం. ఇది అన్న కెరీర్ లో ఒక మైల్ స్టోన్ సినిమా అవుతుంది.

అలానే అందరూ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, వచ్చిన సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మీ ఆశీర్వచనాలతోనే ఆస్కార్ దాకా వెళ్ళాం. ఆర్ఆర్ఆర్ సక్సెస్ క్రెడిట్ రాజమౌళికే దక్కాలి అని అన్నారు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version