Andhra Pradesh: నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారిని ఇస్రో చైర్మన్ సోమనాథ్ దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రల నుంచే కాకుండా, తమిళ నాడు నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. సూళూరు పేట నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించనున్న SSLV D-1 శాటిలైట్ విజయవంతం కావాలని అమ్మవారికి పూజలు చేయించారు. ఆలయానికి వచ్చిన ఇస్రో చైర్మన్‌కు ఆలయ అధికారులు పూర్ణకలశంతో స్వాగతం పలికారు.
Andhra Pradesh: సూళ్లూరు పేట చెంగాలమ్మకు పూజలు చేసిన ఇస్రో చైర్మన్
