Site icon Prime9

Orange Movie Re Release : తెలుగు రాష్ట్రాల్లో మోతమోగిస్తున్న ఆరెంజ్ మానియా.. థియేటర్లలో పూనకాలే

interesting details about orange movie re release details

interesting details about orange movie re release details

Orange Movie Re Release : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో ఇప్పటికి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తున్న మూవీ లలో ఆరెంజ్ మూవీ ఒకటి. ఈ క్రేజీ మూవీ కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించగా.. జెనీలియా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. 2010లో రిలీజైన ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు నిర్మించారు. ఈ మూవీ కి హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు.

ప్రస్తుతం రీరిలీజ్‌ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. హీరోల పుట్టిన రోజులకు, పలు ముఖ్యమైన సందర్భాల్లో వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. పాత సినిమాలను నేటి టెక్నాలజీకి మార్పులను జోడించి, మరలా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తాజాగా ఆరెంజ్ సినిమాని చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా నిన్నటి నుంచి మెగా అభిమానులు ఈ మూవీకి బ్రహ్మరధం పడుతూ.. థియేటర్లలో మోత మోగిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆరెంజ్ మూవీకి నెక్స్ట్ లెవెల్లో ప్రేక్షకులు వస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మేరకు సినిమాని చూసిన వారంతా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ వైరల్ చేస్తున్నారు.

ఈ మూవీ సంగీతం ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఈ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో మూడవ మూవీ గా రూపొందింది. మగధీర లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన సినిమా కావడంతో ఈ మూవీ పై మెగా అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అప్పుడు వారి అంచనాలను అందుకోవడంలో మూవీ విఫలమైంది.

‘ఆరెంజ్’ సినిమాను రీరిలీజ్ చేసి, వచ్చిన నగదును జనసేనకు విరాళంగా ఇస్తామని నాగబాబు ప్రకటించారు. తాజాగా అభిమానులంతా థియేటర్లో సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియో ను ట్విట్టర్ వేదికగా అభిమనులతో పంచుకున్నారు. ఈ మేరకు థియేటర్ల వద్ద మెగా పవర్ స్టార్ అభిమానులు కట్టిన భారీ ఫ్లెక్సిలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి. సంధ్య 70 ఎమ్ఎమ్ వద్ద కట్టిన ఫ్లెక్సీ మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.

 

 

Exit mobile version