Site icon Prime9

Agent Movie : ధృవ x ఏజెంట్ మల్టీవర్స్.. అక్కినేని అఖిల్ కోసం రంగంలోకి దిగిన రామ్ చరణ్

interesting details about akhil agent movie multiverse with ram charan dhruva

interesting details about akhil agent movie multiverse with ram charan dhruva

Agent Movie : ఇటీవల కాలంలో ఒక కథని మరో కథతో లింక్ చేస్తూ “సినీమాటిక్ యూనివర్స్” కాన్సెప్ట్ తో పలు సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. “మల్టీవర్స్”, “సినీమాటిక్ యూనివర్స్” అనే పదాలు ఎక్కువగా హాలీవుడ్ సినిమాల్లో ఇన్నాళ్ళూ గమనించాం. ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఈ పోకడకి దర్శకులు నాంది పలుకుతున్నారు. మేకర్స్ అంతా కూడా తమ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తమిళ్ లో ఈ విధంగా వచ్చిన విక్రమ్, హిందీలో పఠాన్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాయి. విక్రమ్ సినిమాలో ఖైదీని లింక్ చేయగా.. పఠాన్ లో టైగర్ సల్మాన్ ని లింక్ చేశారు. అలాగే అజయ్ దేవ్ గన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ సినిమాలను కలిపి కాప్ యూనివర్స్ క్రియేట్ చేశారు. ప్రభాస్ హీరోగా చేస్తున్న ప్రాజెక్ట్ కె కూడా ఇదే కాన్సెప్ట్ తో రానుందని సోషల్ మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలోకి అఖిల్ నటించిన ఏజెంట్ కూడా రానుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి.

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. అక్కినేని అఖిల్ కాంబినేషన్ లో వస్తున్న ఏజెంట్ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుంది. అదే విధంగా ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక ముఖ్య పాత్ర చేస్తుండగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీకి స్టార్ రైటర్ వక్కంతం వంశీ కథ అందించగా హిప్ హాప్ తమిళ సంగీతం సమకూర్చాడు. ఏప్రిల్ 28న మూవీ తెలుగు మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో ఉన్న చిత్ర యూనిట్ తాజాగా ఒక వీడియో పోస్ట్ చేసింది.

ఆ వీడియోలో రామ్ చరణ్ ధృవ థీమ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుండగా.. రామ్ చరణ్ ని వెనుక నుంచి చూపించారు. ఇక వీడియో చివర్లో చరణ్.. “ఏజెంట్ ఎక్కడ ఉన్నావు” ఐ డైలాగ్ చెప్పడం విశేషం. కాగా చరణ్ అంతకు ముందు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా చేయగా.. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్వరలోనే ఈ మూవీ సీక్వెల్ కూయ రానుందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ వీడియోని చూసిన వారంతా ఏజెంట్ లో రామ్ చరణ్ ఉన్నదని భావిస్తూ సురేందర్ రెడ్డి కూడా సినిమాటిక్ యూనివెర్స్ ప్లాన్ చేశాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

 

 

అక్కినేని అఖిల్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 9 ఏళ్లు అవుతున్నా.. అతడికి సరైన మాసివ్ హిట్ పడలేదనే చెప్పాలి. 2021లో పూజా హెగ్డేతో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. అతడి స్టార్ డమ్‌ను మాత్రం పెంచలేదనే చెప్పాలి. దాంతో ఈ సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలని భావిస్తున్న అఖిల్ కోసం రామ్ చరణ్ రంగం లోకి దిగినట్లు అంతా భావిస్తున్నారు. ఇక ఇదే నిజం అయితే అయ్యగారు హిట్ కొట్టడం పక్కా అని అక్కినేని ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.

Exit mobile version