Site icon Prime9

Burj Khalifa: కేరళ నుంచి రేంజి రోవర్ కారు తీసుకువెళ్లి దుబాయ్ బుర్జ్ ఖలీఫా ముందు పార్క్ చేసిన వ్యాపారి

Burj Khalifa

Burj Khalifa

Burj Khalifa:ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు కదా! ఇండియాకు చెందిన ఓ వ్యాపారి తన లగ్జరీ కారు రేంజి రోవర్‌ను కేరళ నుంచి దుబాయికి తీసుకువెళ్లి ప్రపంచంలోనే అత్యంతఎత్తైన ఆకాశహర్మ్యం బుర్జ్‌ ఖలీఫా ముందు పార్క్‌ చేశాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆయన పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. మరో పోస్ట్‌లో ఈ కారు కలెక్టర్‌.. కారు గురించి ప్రస్తావిస్తూ.. ఈ లగ్జరీ కారు జన్మించింది 2011లో … ఇండియాలో 13 ఏళ్ల పాటు అక్కడ ఉండి ప్రస్తుతం దుబాయి పర్యటనకు వచ్చిందని చెప్పాడు.

కారుకు దుబాయి చూపిస్తున్నాను..(Burj Khalifa)

ఇండియాకు చెందిన వ్యాపారవేత్త దిలీప్‌ హీల్బ్రోన్ తన లగ్జరీ కారు రేంజి రోవర్‌ను కేరళ నుంచి దుబాయికి షిప్‌లో తీసుకువచ్చాడు. బుర్జ్‌ ఖలీఫా వద్ద పార్క్‌ చేసిన ఈ కారును ఆయన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశాడు. వీడియోలో ఆయన తన బ్లాక్‌ లగ్జరీ కారు ముందు నుంచోని కెమెరాకు ఫోజు ఇచ్చాడు. కాగా కారుపై కేరళ నంబరు ప్లేట్‌ ఉంది. తన సొంత ఊరు నుంచి సుదూర ప్రయాణం చేసి దుబాయికి వచ్చిందన్నారు. తమ కారుకు దుబాయి చూపిస్తున్నామన్నాడు దిలీప్‌. 2011 నుంచి ఈ కారు తమ కుటుంబంలో ఒక భాగమైపోయిందంటూ క్యాప్షన్‌ పోస్ట్‌ పెట్టాడు.

మరో పోస్ట్‌లో ఈ కారు కలెక్టర్‌ దిలీప్‌ ఈ కారు పుట్టింది 2011లో ఇంగ్లాండ్‌లో…. అటు తర్వాత 13 ఏళ్ల పాటు కేరళలో ఉంది. ప్రస్తుతం దుబాయిలో ఎంజాయ్‌ చేయడానికి వచ్చింది. మీ కారును మీరు జాగ్రత్తగా చూసుకుంటే .. కారు కూడా మిమ్మల్ని భద్రంగా చూసుకుంటుందంటూ రాసుకొచ్చాడు దిలీప్‌. కాగా దిలీప్‌ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన స్థిరాస్తి వ్యాపారి. కారు కలెక్టర్‌, గోల్ఫర్‌, ట్రావెలర్‌, తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లతో యువతకు ప్రేరణగా నిలుస్తుంటారు. ఇన్‌స్టాగ్రాం రీల్‌ను ఏప్రిల్‌ 30న షేర్ చేస్తే .. సుమారు ఐదు లక్షల వ్యూస్‌ వస్తే 25వేల మంది లైక్‌ చేశారు. కిడ్స్‌ పిల్లలనుయూఈఏకి తీసుకువచ్చినంట్లే తన కేరళ రిజిష్టర్‌ కారు యూఏఈకి తీసుకువచ్చానని అన్నాడు. దీనికి ఓ యూజర్‌ స్పందిస్తూ.. మీరు లెజెండ్‌ బాస్‌.. కెఎల్‌ రిజిస్ర్టేషన్‌ కారును యూఏకీ తీసుకువచ్చారని అభినందించారు.

మరో యూజర్‌ ఎడాప్పాల్‌ టూ దుబాయి అని రాసుకొచ్చారు. మరో యూజర్‌ ఓ మైగాడ్‌ మీది నిజమైన ప్రేమ .. పెద్ద మనసు అంటూ రాసుకొచ్చారు. మరో యూజర్‌ గాడ్స్‌ ఓన్‌ కంట్రీ నుంచి డ్రీమ్స్‌ ఓన్‌ కంట్రీకి తెచ్చావు బ్రో అంటూ పోస్ట్‌ పెట్టాడు. ఇండియాకు చెందిన కెఎల్‌ రిజిస్ర్టేషన్‌ ప్లేట్‌ దుబాయి రోడ్లపై కనిపించి భారతీయులు గర్వపడేలా చేసింది బ్రో అంటున్నారు ఇన్‌స్టా యూజర్లు.. పరిస్థితి ఇలా ఉంటే దిలీప్‌ను ఆదరణగా తీసుకొనిఇండియాకు చెందిన యువకులు తమ లగ్జరీ కార్లను దుబాయి రోడ్లపై పరేడ్‌ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న గుసగుసలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.

Exit mobile version