Site icon Prime9

Inquilab Temple: ఇండియాలో ఇంక్విలాబ్ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

Haryana: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నారు. స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన గొప్ప వ్యక్తులను స్మరించుకుంటున్నారు. అయితే స్వాంతంత్ర్య దినోత్సవం నాడే కాకుండా సాధారణ రోజుల్లో కూడ వారిని స్మరించుకుంటూ పూజలు చేసే దేవాలయం ఒకటి భారత్ లో ఉందనే విషయం చాలా మందికి తెలియదు,

హర్యానాలోని యమునానగర్‌లో ఉన్న ఈ ఆలయం గుమ్తాలా అనే గ్రామంలో ఉంది. హిందువులు, ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు ప్రతిరోజూ ఈ ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. సుమారు 22 సంవత్సరాల క్రితం ఇక్కడ ‘ఇంక్విలాబ్ ఆలయం’ నిర్మించబడింది. ఈ ఆలయంలో ప్రతిరోజు పండుగే. స్వాతంత్య్ర సమరయోధులు, విప్లవకారుల స్మారకార్థం ఇక్కడ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదాలు మిన్నంటుతాయి. అమరవీరుల జ్ఞాపకార్థం స్థాపించబడిన భారతదేశంలోని ఏకైక ‘ఇంక్విలాబ్ ఆలయం’ ఇది. ప్రజలు అమరవీరుల విగ్రహాలకు పూలదండలు సమర్పించి వందనాలు చేస్తారు. అమరవీరుల కుటుంబాలు కూడా ఇక్కడకు వస్తాయి.

ఇక్కడ నిర్వహించిన కార్యక్రమాల్లో షహీద్ మంగళ్ పాండే వారసులైన దేవిదయాళ్ పాండే, శీతల్ పాండేలు కూడా పాల్గొన్నారు. రాష్ట్ర క్రీడల మంత్రి సందీప్ సింగ్, ఆర్ఎస్ఎస్ ఇంద్రేష్ కుమార్, రాష్ట్ర మాజీ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్, బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యుడు ఆర్ మహమ్మద్ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ఆలయంలో, రాజ్‌గురు, షహీద్ సుఖ్‌దేవ్, భగత్ సింగ్, లాలా లజపత్ రాయ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భీమ్ రావ్ అంబేద్కర్, అష్ఫాఖుల్లా ఖాన్‌ల పుట్టినరోజులు మరియు వర్ధంతి సందర్భంగా వేడుకలు నిర్వహిస్తారు.

Exit mobile version