Team India: వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ నెంబర్ వన్

India Rank: న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగులతో భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో భారత్ వన్డేల్లో మెుదటి స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో మ్యాచులో భారత్ తొలుత 386 పరుగులు చేసింది.

India Rank: న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగులతో భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో భారత్ వన్డేల్లో మెుదటి స్థానానికి చేరుకుంది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో మ్యాచులో భారత్ తొలుత 386 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్.. 295 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను ఇండియా క్లీస్ స్వీప్ చేసింది.

వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమితో న్యూజిలాండ్.. తన వన్డే ర్యాంకింగ్ మెుదటి స్థానాన్ని కోల్పోయింది. ఈ విజయంతో భారత్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. టీ20 ర్యాంకింగ్స్ లో భారత్ మెుదటి స్థానంలో ఉంది.

 

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేయడంతో.. ఇంగ్లాండ్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-0 అంతకంటే మెరుగ్గా గెలిస్తే మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ నంబర్‌వన్‌గా మారే అవకాశం ఉంటుంది.

13 ఏళ్ల తర్వాత.. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం భారత్‌కు ఇదే తొలిసారి.

ఇక వన్డేల్లో రోహిత్‌ మూడేళ్ల నిరీక్షణ తర్వాత శతకం బాదాడు. రోహిత్ చివరగా 2020 జనవరిలో ఆస్ట్రేలియాపై మూడంకెల స్కోర్ సాధించాడు.

ఈ సిరీస్‌లో శుభ్‌మన్‌ పరుగులు 360 పరుగులు చేశాడు. బాబర్‌ అజామ్‌ నెలకొల్పిన ప్రపంచ రికార్డును గిల్ సమం చేశాడు.

టీ20 ర్యాంకింగ్స్ లో 267 పాయింట్లతో ఇండియా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.
266 పాయింట్లతో రెండో స్థానంలో ఇంగ్లాండ్ కొనసాగుతుంది.

వన్డే ర్యాంకింగ్స్ లో 114 పాయింట్లతో ఇండియా ముందు వరుసలో ఉంది.
113 పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో కొనసాగుతుంది.
111 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానానికి పడిపోయింది.

ఇక టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా మెుదటి స్థానంలో ఉంది.
ఆస్ట్రేలియాకు 126 పాయింట్ల ఉన్నాయి.
115 పాయింట్లతో ఇండియా రెండో స్థానంలో కొనసాగుతుంది.

ట్వీ20 ర్యాంకింగ్స్ లో సూర్యకుమార్ 908 పాయింట్లతో మెుదటి స్థానంలో ఉన్నాడు.

ఇక బౌలింగ్ లో 698 పాయింట్లతో రషీద్ ఖాన్ ముందున్నాడు.
ఆల్ రౌండర్ల విషయానికి వస్తే బంగ్లా ఆటగాడు.. షకీబ్ 252 పాయింట్లతో ఉన్నాడు.

వన్డే ర్యాంకింగ్స్ లో బాబర్ ఆజమ్ 887 పాయింట్లతో ముందు వరుసలో ఉన్నాడు

వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో కివీస్ పేసర్ బౌల్ట్ 730 పాయింట్లతో ముందున్నాడు.

ఆల్ రౌండర్ల విషయానికి వస్తే బంగ్లా ఆటగాడు.. షకీబ్ 389 పాయింట్లతో ముందున్నాడు.

టెస్ట్ ర్యాంకిగ్స్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ లబుస్ చేంజ్ 929 పాయింట్లతో ముందు వరుసలో ఉన్నాడు.
టెస్ట్ బెస్ట్ బౌలర్ గా 878 పాయింట్లతో ప్యాట్ కమిన్సన్ ఉన్నాడు.
ఆల్ రౌండర్ జాబితాలో ఇండియన్ ప్లేయర్ రవీంద్ర జడేజా 369 పాయింట్లతో మెుదటి స్థానంలో ఉన్నాడు.

 

 

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/