IND Vs SL 2nd ODI: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుత విజయాన్ని సొంత చేసుకున్న టీంఇండియా .. రెండో వన్డేకు సిద్ధమయింది. గెలుపే ధ్యేయంగా గురువారం కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో వన్డేకు బరిలోకి దిగుతోంది. ఈ వన్డేలోనూ నెగ్గి సిరిసీ కైవసం చేసుకోవాలని ఉంది రోహిత్ సేన. ఇక తొలి వన్డేలో కెప్టెన్ మినహా తేలిపోయిన శ్రీలంక రెండో వన్డేలో పుంజుకోవాలని చూస్తోంది.
రోహిత్ పై భారీ అంచనాలు
8 ఏళ్ల క్రితం భారత్, శ్రీలంక జట్లు చివరిసారి ఈ మైదానంలో తలపడ్డాయి. అప్పడు రోహిత్ రికార్డు స్కోరు (264) సాధించాడు. ఈసారి అతడిపై భారీ అంచనాలున్నాయి. గాయం నుంచి కోలుకుని వచ్చిన రోహిత్ తన పిట్ నెస్ పై ఉన్న సందేహాలను తొలి వన్డే తో పుల్ స్టాప్ పెట్టాడు. ఇపుడు తనకు ఎంతో ఇష్టమైన గ్రౌండ్ లో ఆడేందుకు రెడీ అయ్యాడు. మరో వైపు విరాట్ కోహ్లి ఫామ్ లో ఉండటం టీంఇండియా అనుకూలం. ఫస్ట్ వన్డేలో అదరగొట్టిన కోహ్లి 73 వ ఇంటర్నేషనల్ సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక శుబ్ మన్ గిల్ కూడా రెండో వన్డేలో రాణిస్తే ఇండియా టాప్ ఆర్డర్ కుదురుకున్నట్టే. బౌలింగ్ లో షమి , మహ్మద్ సిరాజ్ , ఉమ్రాన్ మాలిక్ లు ప్రత్యర్థి కి సమస్యలు స్రుష్టిస్తారని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇప్పడు ఫామ్ లో ఉన్న భారత్ ను అడ్డుకోవాలంటే శ్రీలంక గట్టిగా కష్టపడాలి. కెప్టెన్ శానక తో పాటు ఓపెనర్ నిశాంక కూడా రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. వీరితో పాటు కుశాల్ మెండిస్, ఫెర్నాండో లు కూడా మంచి ప్రదర్శన కనపరిస్తే శ్రీలంక రేసులో నిలబడుతుంది. టీమిండియా పై గెలవాలంటే శ్రీలంక జట్టు సమిష్టిగా పోరాడాల్సి ఉంటుంది.
5 ఏళ్ల తర్వాత వన్డే
ఇప్పడివరకు ఈడెన్ గార్డెన్ లో భారత్ 21 వన్డేలు ఆడింది. 12 మ్యాచుల్లో విజయం సాధించి.. 8 మ్యాచ్ పరాజయం చవిచూసింది. ఒక మ్యాచ్ రద్దు అయింది. ఇక్కడే శ్రీలంకతో 5 మ్యాచులు ఆడిన టీంఇండియా 3 గెలవగా, ఒకటి ఓడింది. మరో మ్యాచ్ రద్దు అయింది. ప్రస్తుతం పిచ్ ప్రకారం టాస్ గెలిచిన టీమ్ బ్యాటింగ్ కు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాగా , ఈ గ్రౌండ్ లో చివరి సారి వన్డే మ్యాచ్ జరిగి 5 ఏళ్లు అయింది. చివరగా ఇక్కడ ఆసిస్ తో తలపడిన ఇండియా 252 పరుగులకు ఆల్ అవుట్ అయింది.
ఇవీ చదవండి:
థియేటర్ లో మాస్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. రచ్చ చేసిన ఫ్యాన్స్
మా నాన్న తర్వాతే ఎవరైనా.. బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి కామెంట్స్
వీరసింహా రెడ్డి మూవీ రివ్యూ..
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/