Site icon Prime9

పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. 92 దేశాల్లో 35వేలకుపైగా కేసులు

Monkeypox cases: ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసులు పెరుగుతున్న తీరుపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామో ఘెబ్రేయేషన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇప్పటి వరకు మంకీపాక్స్‌ 92 దేశాలకు విస్తరించగా, 35వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. 12 మంది ప్రాణాలుకోల్పోయారు. గతవారం సుమారు 7,500 కేసులు నమోదయ్యాయని, గతవారంతో పోలిస్తే 50శాతం పెరిగాయని టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తం చేస్తూ, టీకాలను వేయాలని సూచించారు.

మంకీపాక్స్‌ నియంత్రణలో టీకాలు సైతం ముఖ్యపాత్రను పోషిస్తాయన్నారు. ఇటీవల మంకీపాక్స్‌ వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్లను ప్రకటించింది. కొత్త వేరియంట్ల క్లాడ్‌-1, క్లాడ్‌-2 ఏ, క్లాడ్‌-2 బీగా పేర్లు పెట్టింది. 2బీ ఈ ఏడాదిలో కొత్త వేరియంట్‌ గ్రూప్‌. మంకీపాక్స్‌కు వెంటనే కొత్త పేర్లను ఉపయోగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ఈ వైరస్‌కు కొత్త పేర్లను పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం సాంస్కృతిక, సామాజిక నేరాలను నివారించడమేనని పేర్కొంది.

Exit mobile version