Site icon Prime9

Income Tax raids: బిగ్ బ్రేకింగ్.. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇంట్లో ఐటీ సోదాలు

Income Tax raids on producer Dil Raju’s properties in Hyderabad: ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు దిల్ రాజు ఇళ్లతో పాటు పలు కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కాగా, ప్రస్తుతం దిల్ రాజు తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే, హైదరాబాద్‌లో 8 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్ నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్ రాజు ఇంటి తో పాటు ఆయన ఆఫీసుల్లోనూ సోదాలు చేపట్టారు. అలాగే ఆయన సోదరుడు, కుమార్తె, బంధువుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఏకకాలంలో 55 బృందాలు ఇందులో పాల్గొన్నట్లు సమాచారం. కాగా, ఇటీవల ఆయన నిర్మించిన సంక్రాంతి వస్తున్నాం సినిమా రూ,200 కోట్లు వసూళ్లు చేసిన సంగతి తెలిసిందే.

Exit mobile version