Ilayaraja: గుడిలో ప్రముఖ సంగీత విద్యాంసుడు ఇళయరాజాకు చేదు అనుభవం

  • Written By:
  • Updated On - December 16, 2024 / 01:04 PM IST

Ilaiyaraja Denied Entry Into Temple: మ్యూజిక్‌ మ్యాస్ట్రో, దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజకు గుడిలో చేదు అనుభవం ఎదురైంది. తమిళనాడులోని ఆండాల్‌ ఆలయాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ఆయన వెళ్తుండగా అక్కడే ఉన్న జీయర్‌ ఆయనని అడ్డుకున్నారు. దీంతో గర్భగుడి బయటే నిలబడి ఆయన పైజ చేసుకుని వేళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఆలయంలో ఆయనను అడ్డుకోవడం ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.

సంగీత దర్శకుడి ఎన్నో పాటలు ఆలపించారు. తన పాటలతో స్వామిని కీర్తించిన ఈ సంగీత విద్యాంసుడికి దక్కిన గౌరవం ఇదేనా? అని అంతా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వివాదంపై ఆలయ నిర్వహకులు వివరణ ఇచ్చారు. అర్ధ మండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని తెలిపారు. ఆలయ నియమాలకు విరుద్ధంగా ఇతరులెవరూ ఆ మండంలోకి ప్రవేశించడానికి వీల్లేదని స్పస్టం చేశారు. ఇళయరాజ అనుకోకుండా అర్థమండపంలోకి వచ్చారని, అది గురించిన సిబ్బంది ఆయన్ని బయటకు పింపించినట్టు వివరణ ఇచ్చింది.

కాగా డిసెబర్‌ 16 నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ దేవాలయమైన ఆండాళ్‌ ఆలయంలో భక్తులు భారీ వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. అలాగే మ్యూజిక్‌ మ్యాస్ట్రో కూడా ఆండాళ్‌ స్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజామునే ఆలయానికి వచ్చిన ఆయనకు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం పట్ల అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.