Site icon Prime9

Allu Arjun : రీ రిలీజ్ కి రెడీ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “దేశముదురు”..

icon star allu arjun desamuduru movie re release details

icon star allu arjun desamuduru movie re release details

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకవైపు వరుస సినిమాల్లో నటిస్తూ సినిమా సినిమాకి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నారు. అల్లు రామలింగయ్య మనవడు, నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రి లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ వరుస హిట్లతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. బన్నీ డాన్స్ లకు, స్టైల్ కి, నటనకి అందరూ ఫిదా అయిపోయి స్టార్ హీరో రేంజ్ ఇచ్చేశారు. ఇక ఇటీవల డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో బన్నీ.. పక్కా ఊర మాస్ పాత్రలో అదరగొట్టారు. దీంతో దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్ కు ఫాలోయింగ్ పెరిగిపోయి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

తన కెరీర్ లో ఎన్నో హిట్లను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ కి ‘దేశముదురు’ ఒక ప్రత్యేక మాస్ ఇమేజ్ ని కట్టబెట్టింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2007 లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ చిత్రంతోనే హన్సిక టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది.  కాగా ఈ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు ఉన్న సంగతి తెలిసిందే. ఈ పుట్టినరోజు సందర్భంగా దేశముదురు సినిమాని రీ రిలీజ్ చేసి ఈ ఏడాది బన్నీ బర్త్ డే ఇంకొంచెం స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు అభిమానులు. ఏప్రిల్ 6న ఈ మూవీ భారీ ఎత్తున్న రిలీజ్ అవుతుంది.

 

అప్పట్లో సిక్స్ ప్యాక్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ (Allu Arjun)..

అల్లు అర్జున్ కి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో రీ రిలీజ్ కి కేరళ స్టేట్ లో కూడా అత్యధిక థియేటర్ లో దేశముదురు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్స్, సాంగ్స్, డాన్స్, ఫైట్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్ అన్ చెప్పాలి. మొదటిసారి ఈ సినిమా తోనే అల్లు అర్జున్ టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ కల్చర్ ని పరిచయం చేశాడు. ఈ మూవీ తరువాత చాలా మంది హీరోలు సిక్స్ ప్యాక్ చూపిస్తూ బన్నీని అనుసరిస్తూ వచ్చారు. దివంగత మ్యూజిక్ డైరెక్టర్ చక్రి ఇచ్చిన సంగీతం ఇప్పటికీ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఇప్పటి వరకు తెలుగు హీరోలకు సంబంధించిన రీ రిలీజ్ లు కేరళలో ఒక ఏరియాలో మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ దేశముదురు మాత్రం కేరళ స్టేట్ మొత్తం మీద రిలీజ్ కాబోతుంది. మొత్తం 50 షోలకు పైగా పడబోతున్నాయి. ఇంకా షోలు పెరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఇక కేరళలో బన్నీ క్రేజ్ చూపిస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

Exit mobile version