ICAR Entrance Examinations 2022: ICAR ఎంట్రన్స్ ఎగ్జామ్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్-2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్, icar.nta.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • Written By:
  • Publish Date - July 21, 2022 / 12:35 PM IST

ICAR Entrance Examinations 2022: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్-2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు వెబ్‌సైట్, icar.nta.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐసిఏఆర్ 2022 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి చివరి తేదీ ఆగస్టు 19, 2022. “నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తుంది. అండర్ గ్రాడ్యుయేట్ , పిజి, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పిహెచ్ డి లో ప్రవేశాలు కోరుకునే అభ్యర్దులు ఈ ఎంట్రన్స్ రాయవలసి వుంటుంది.

ముఖ్యమైన తేదీలు..
వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్ యొక్క ఆన్‌లైన్ సమర్పణ: జూలై 19 నుండి ఆగస్టు 19, 2022 వరకు
క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/ యూపీఐ ద్వారా పరీక్ష రుసుము చెల్లించడానికి చివరి తేదీ: ఆగస్టు 19, 2022
వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తు ఫారమ్ యొక్క వివరాలలో దిద్దుబాటు: ఆగస్టు 21 నుండి 23, 2022