Vijayawada: ఈ దినం ఉదయం విజయవాడ జింఖానా మైదానంలో చోటుచేసుకొన్న బాణసంచా దుకాణాల అగ్ని ప్రమాదంలో ఇరువురు చనిపోయిన సంగతి విధితమే. దీనిపై భాజపా నేత విష్ణు వర్ధన రెడ్డి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రమాదకర వ్యాపారాలకు నగరంలోని కీలక ప్రాంతంలో ఎలా అనుమతి ఇస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
మంటలు బలంగా వ్యాపించడంతో 15 దుకాణాలు అంటుకొన్నాయన్నారు. పక్కనే ఉన్న పెట్రోల్ బంకు పేలితే పరిస్ధితి ఏంటంటూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీనికి అనుమతి మంజూరు చేసిన వారు ఎవరంటూ ప్రశించారు. ఇది పూర్తిగా ప్రభుత్వం అనాలోచితమైన నిర్ణయంగా పేర్కొన్నారు. పోలీసు, ఫైర్, మునిసిపల్, రాష్ట్ర ప్రభుత్వం వీరిలో ఎవరిదీ తప్పు కాదా అంటూ నిలదీశారు. బాధిత కుటుంబాలకు రూ. 25లక్షల రూపాయలు ఇచ్చి, ఘటనకు బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Hand Pump: రోడ్డు మద్యలో నీటి పంపు.. అధికారుల బాధ్యతారాహిత్యానికి నిలువుటద్దం