Site icon Prime9

Amith Shah: హిందీలో ఎంబీబీఎస్.. ఇదో విప్లవాత్మకమైన ఘట్టమన్న అమిత్ షా

Amit Shah

Amit Shah

Amith Shah: ఇకపై మనదేశ భాష అయిన హిందీలోనే వైద్యవిద్య కొనసాగనుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో హిందీ మీడియంలో ఎంబీబీఎస్‌ కోర్సును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అదివారం (అక్టోబర్‌ 16)న ప్రారంభించారు. ఈ క్రమంలో ఎంబీబీఎస్‌ సబ్జెక్టులైన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీలకు సంబంధించిన మూడు వైద్యవిద్య హిందీ టెక్ట్స్‌ బుక్‌లను షా ఆవిష్కరించారు. మాతృభాషలో మెడికల్‌ విద్య అధ్యయనం ద్వారా విద్యార్థులు త్వరగా అర్ధంచేసుకుని సబ్జెక్టుపై మంచి పట్టు సాధిస్తారని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

చరిత్రలో ఈ రోజు చిరస్థాయిగా నిలిచిపోతుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్‌ కోర్సును ప్రారంభించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ రికార్డుకెక్కిందని ఆయన పేర్కొన్నారు. ఇది విద్యారంగంలో విప్లవాత్మకమైన ఘట్టమని ఆయన వెల్లడించారు. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందన్నారు. హిందీ మీడియంతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో మెడికల్, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో విద్యను అందించాలనే లక్ష్యంతో మోదీ పనిచేస్తున్నారు. తత్ఫలితంగా మన భాషలకు ప్రాధాన్యం లభిస్తుందని పేర్కొన్నారు.

ఇటీవల కాలంలో ఇంగ్లీషు భాషను బలవంతంగా విద్యార్థులపై రుద్దే ప్రయత్నం జరుగుతుందని ఇది వారి మేధో సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని, అసలు ఇంగ్లీషుకు మేధో సామర్ధ్యానికి సంబంధం లేదని షా తెలిపారు. భాష అనేది కమ్యూనికేషన్‌కు ఒక సాధనం మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. మాతృభాషలో విద్యను అందిస్తే అది విద్యార్ధుల్లో మేధో సామర్థ్యాన్ని పెంచుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఇప్పటికే 8 రాష్ట్రాలు తమ మాతృభాషలో ఇంజనీరింగ్ టెక్ట్స్ బుక్‌లను సిద్ధం చేసే పనిని ప్రారంభించాయి. త్వరలోనే రీసెర్చ్‌, డెవలప్‌మెంట్ కార్యక్రమాలను కూడా ప్రాంతీయ భాషల్లో ప్రారంభిస్తామని అమిత్ షా వెల్లడించారు.

ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసిన రాహుల్ గాంధీ

Exit mobile version