Site icon Prime9

NTR : ఎన్టీఆర్ తో మూవీ చేయాలని ఉందంటున్న గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీ డైరెక్టర్ జేమ్స్ గన్..

hollywood famous director james gun interested to work with jr ntr

hollywood famous director james gun interested to work with jr ntr

NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన మూవీ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలానే అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుని, ప్రతిష్టాత్మక అకాడెమీ అవార్డ్ ను ఇండియాకు తీసుకొచ్చింది. దీంతో ఇద్దరికీ హాలీవుడ్ రేంజ్ లో ప్రశంసలు దక్కాయ. కాగా ఈ తరుణంలోనే పలువురు హాలీవుడ్ డైరెక్టర్స్.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌ లతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాగా తాజాగా టాప్ హలివుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్.. ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలని ఉందని చెప్పడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రిగా మారింది. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాతో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న అయన ఎన్టీఆర్ తో మూవీ చేయాలని ఉందని చెప్పడం గ్రేట్ అనే చెప్పాలి.

 

YouTube video player

Exit mobile version
Skip to toolbar