Site icon Prime9

Hyderabad: హైదరాబాదులో భారీ వర్షం

Heavy rain in Hyderabad

Heavy rain in Hyderabad

Heavy Rain: హైదరాబాదులో భారీ వర్షం పడింది. పలు ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. జోరుగా కురుస్తున్న వర్షంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పాలైనారు.

అంబర్‌పేట, ముసారంబాగ్, మలక్‌పేటలో భారీ వర్షం కురిసింది. చంపాపేట్, ఐఎస్ సదన్, సంతోష్‌నగర్‌, సైదాబాద్, చాదర్‌ఘాట్‌, కోఠిలో భారీ వర్షం పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌లో భారీగా వర్షం పడడంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరి వాహనాదరులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడడంతో ప్రజలు షెల్టర్లకు వద్దకు పరుగులు తీశారు.

కోస్తా, ఆంధ్రాలో కురుస్తున్న వర్షాల ప్రభావం హైదరాబాదులో ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే వర్ష ప్రభావం హఠాత్తుగా వస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలౌతున్నారు. పలు చోట్ల రోడ్లపై నిలబడ్డ నీటితో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇది కూడా చదవండి:Rain Alert: కోస్తాంధ్రాకు భారీ వర్షాలు..హెచ్చరించిన వాతారవరణ శాఖ

Exit mobile version