Mekapati Chandrashekhar Reddy: ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి హార్ట్ ఎటాక్కు గురయ్యారు.
మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో అసౌకర్యంగా అనిపించగా వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
అక్కడి వైద్యులు ఆయనకు అనేక పరీక్షలు జరిపి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చినట్టు గుర్తించారు.
నెల్లూరు అపోలోలో చికిత్స
హార్ట్ కు సంబంధించిన రక్తనాళాల్లో రెండు చోట్ల పూడికలు ఉన్నట్లు డాక్టర్స్ గుర్తించారు. ప్రెజెంట్ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాగా మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు చెన్నై తీసుకుళ్లనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి(Mekapati Chandrashekhar Reddy) వైఎస్సార్సీపీ నుంచి ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
నాలుగుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు.
కొడుకు గుర్తింపు రచ్చ
ఇకపోతే గత కొద్దిరోజుల క్రితం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడినని.. తన చిన్నప్పుడే తనను, తన తల్లిని మేకపాటి వదిలేసివెళ్లాడని,
తన చదువు పూర్తి అయ్యి, వివాహం అయ్యి, తనకి కొడుకు పుట్టే సమయంలో కూడా తన తండ్రిని మిస్ అయ్యాను అని మేకపాటి శివ చరణ్ రెడ్డి అనే యువకుడు రాసిన బహిరంగ లేఖ పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే.
శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ డబ్బుకోసం అయితే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని (నాన్న అని సంబోధిస్తూ) అడిగేవాడిని అని, తనకి డబ్బు అక్కర్లేదని, తనకి గుర్తింపు కావాలని చెప్తూ, ప్రూఫ్ గా ( S/O మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్న) డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ ని కూడా అప్పుడు మీడియా ముందు చూపించారు.
ఇకపోతే శివచరణ్ రెడ్డి తల్లి కూడా మీడియా ముందుకు వచ్చి చంద్రశేఖర్ రెడ్డి తన భర్త అని..
శివచరణ్ రెడ్డి తనకు చంద్రశేఖర్ రెడ్డికి పుట్టిన కొడకని.. తనను వెంటపడిమరీ చంద్రశేఖర్ రెడ్డి వివాహం చేసుకున్నారని చెప్పారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/