Site icon Prime9

Hardik Pandya-Natasa: కొడుకు సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకోనున్న హార్దిక్ పాండ్యా

Hardik Pandya-Natasa

Hardik Pandya-Natasa

Hardik Pandya-Natasa: టీంఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. హార్ధిక్ పాండ్యాకు ఇప్పటికే నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్ కు పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి రెండు ఏళ్ల బాబు(అగస్త్య) కూడా ఉన్నాడు.

అయితే పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకోవడం ఏంటీ అనుకుంటున్నారా? మూడేళ్ల క్రితం నటాషా, హార్ధిక్ పాండ్యాలు 2020, మే 31 న సన్నితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అప్పటి కరోనా పరిస్థితి కారణంగా వీరి వివాహం సాదాసీదాగా జరిగింది.

 మరో సారి స్పెషల్ అకేషన్ గా(Hardik Pandya-Natasa)

అయితే జీవితంలోని స్పెషల్ అకేషన్ ను వేడుకగా జరుపుకోలేకపోయామనే లోటును తీర్చుకునేందుకు ఈ జంట మరోసారి గ్రాండ్ గా వివాహం చేసుకునేందకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 14, వాలెంటైన్స్ రోజున వీరిద్దరు రెండోసారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ వేడుకను పెళ్లిళ్లకు కేరాఫ్ గా మారిన రాజస్థాన్ లో ప్లాన్ చేశారు.

రాజస్థాన్ , ఉదయ్ పూర్ లో ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 16 వరకు వీరి వివాహ వేడుకలు జరుగనున్నాయి. నాలుగు రోజుల పాటు హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరుగనున్నట్టు సమాచారం. ఈ జంట..తమ కుమారుడు అగస్త్య, కుటుంబ సభ్యులు, సన్నితుల సమక్షంలో హిందు సంప్రదాయ పద్దతిలో హార్దిక్, నటాషాను వివాహం చేసుకోనున్నాడు.

2020 లాక్ డౌన్ లో

సెర్బియా దేశానికి చెందిన నటాషా 2012 లో ఇండియాకు వచ్చింది. బాలీవుడ్ లో మోడల్, డాన్సర్, నటిగా తన కెరీర్ ను ప్రారంభించింది. ఈ క్రమంలో వెండితెరపై నటించే అవకాశం వచ్చింది. అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ , షారుక్ ఖాన్ వంటి స్టార్స్ తో నటించింది. ముంబై లోని ఓఎ నైట్ క్లబ్ లో హార్దిక్, నటాషా మొదటిసారి కలిశారు. న‌టాషాను చూడ‌గానే హార్ధిక్ ప్రేమ‌లో ప‌డిపోయాడ‌ట‌. ఆ త‌ర్వాత న‌టాషా కూడా ఈ ఆల్‌రౌండ‌ర్‌పై మ‌న‌సు ప‌డింది.

అప్పుడే వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. తన కంటే ఒక సంవత్సరం పెద్దది అయిన నటాషాకు 2019 డిసెంబర్ లో ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేశాడు. తన ప్రేమను అంగీకరించిన నటాషాను 2020 లాక్ డౌన్ లో అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు హార్దిక్. అదే ఏడాది అగస్త్య పాండ్య పుట్టాడు.

Exit mobile version
Skip to toolbar