Site icon Prime9

Harbhajan Singh: ధోనితో విభేదాలు నిజమే – అసలు విషయం చెప్పిన హర్భజన్‌ సింగ్‌, షాక్‌లో ఫ్యాన్స్‌

Harbhajan Singh Shocking Comments on Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి మాజీ స్పన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మధ్య విభేధాలు ఉన్నాయంటూ ఎంతోకాలంగా పెకార్లు షికార్డు చేస్తున్నాయి. అయితే ఈ రూమర్స్‌పై ఎప్పుడూ కూడా వీరిద్దరు స్పందించలేదు. వారి తీరు చూస్తే కూడా ఈ పుకార్లు నిజమే అన్నట్టుగా అనిపించేవి. వీటిపై ఫ్యాన్స్‌ అంతా డైలామాలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా బయటపెడుతున్న హర్భజన్‌ సింగ్ చేసిన కామెంట్స్‌ అభిమానులను షాక్‌ గురిచేస్తుంది. ఇది విని మిస్టర్‌ కూల్‌ అంతపని చేశాడా? అని బజ్జి ఫ్యాన్స్‌ వాపోతున్నారు.

ఇటీవల ఓ స్పోర్ట్స్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో హర్భజన్ ఈ అంశంపై మాట్లాడారు. ఎందుకో కానీ మా ఇద్దరి మధ్య అంతగా సత్సబంధాలు లేవు. మేమిద్దరం మాట్లాడుకోక పదేళ్లు అవుతుందని, అయితే తమ మధ్య మాత్రం అంతగా విభేదాలు మాత్రం లేవన్నాడు. తామిద్దరం ఆటకు సంబంధించి తప్ప మరే విషయాలు మాట్లాడుకోమని స్పష్టం చేశాడు. కాగా ఐపీఎల్‌లో వీరిద్దరు ఒకే టీంకి ఆడిన సంగతి తెలిసిందే. 2018 నుంచి 2020 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో హర్భజన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. అలాంటి వారి మధ్య మాటలు లేకపోవడం ఏంటని ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు.

అనంతరం బజ్జీ మాట్లాడుతూ.. ధోనీ తనతో మాట్లాడకపోవడానికి అతని వద్ద కారణాలు ఉండొచ్చమో.. కానీ అతడి విషయంలో మాత్రం నాకు ఎలాంటి కోపం లేదు. మేము మాట్లాడుకోకపోవడానికి ఎలాంటి కారణం లేదు. ఐపీఎల్‌లో ఒకే జట్టుగా ఆడినప్పుడు తామిద్దరం పక్కపక్క రూంలోనే ఉండేవాళ్లం. కానీ ఎప్పుడు ఇద్దరం మాట్లాడుకునే వాళ్లం కాదు. అందుకే నాకేప్పుడు ధోనికి ఫోన్‌ చేసే అవకాశం కూడా రాలేదు. ఎందుకో తెలియదు ఆయనేప్పుడు నాతో చోరవ తీసుకుని మాట్లాడింది లేదు. నేను చాలాసార్లు తనతో మాట్లాడేందుకు ప్రయత్నించా. కానీ అటూ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. ఏ బంధమైన పరస్పర చోరవ ఉంటేనే ముందుకు వెళుతుంది. అందుకే నాకు ధోనితో మాట్లాడటం కూడా ఇష్టం లేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్‌ చర్చనీయాంశం అయ్యాయి. ఇది విని విరిద్దరు ఫ్యాన్స్ కంగుతింటున్నారు.

Exit mobile version