Gurukula: గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మెుత్తం 9,231 పోస్టులకు 9 నోటిఫికేషన్లను విడుదల చేసింది. అయితే ఈసారి ఓటీఆర్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ మేరకు ఓటీఆర్ ఏర్పాట్లను పూర్తి చేసింది.
కొలువులకు ఓటీఆర్ (Gurukula)
గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి గురుకుల నియామక బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
మెుత్తం 9,231 పోస్టులకు 9 నోటిఫికేషన్లను విడుదల చేసింది.
అయితే ఈసారి ఓటీఆర్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ మేరకు ఓటీఆర్ ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఓటీఆర్ నమోదు ద్వారా వచ్చే నంబరుతో పోస్టులకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఓటీఆర్ రేపటి నుంచి.. అందుబాటులోకి రానుంది.
అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. పూర్తి ఏర్పాట్లు చేసింది.
సమయం వృధా చేయకుండా అభ్యర్ధులు వెంటనే ఓటీఆర్ నమోదు చేసుకోవాలని సంస్థ సూచించింది.
సమస్యల నివారణకు ఓటీఆర్
గురుకల నియామక సంస్థ 9 నోటిఫికేషన్లను విడుదల చేసింది. దీంతో ఒకటి కన్న ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
అందువల్ల తప్పులు దొర్లే అవకాశం ఉంది. అలాంటి సమస్యలను అధిగమించడానికే ఓటీఆర్ తీసుకొచ్చారు.
ఒక్కసారి ఓటీఆర్ రిజిస్టర్ చేసుకుంటే.. ఎన్ని పోస్టులకైన ఇబ్బంది లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
అధిక ఫీజులు
గురుకుల నియామక బోర్డు నిర్వహించే పరీక్ష ఫీజులు భారీగా ఉంటున్నాయి. టీఎస్ పీఎస్సీతో పోలీస్తే.. చాలా అధికంగా ఉంటున్నాయి.
గత ఉద్యోగ ప్రకటనల సమయంలో దరఖాస్తు ఫీజు రూ.1,200గా, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.600గా నిర్ణయించారు.
దీంతో ఒకటికన్న ఎక్కువ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటే విద్యార్ధులపై భారం పడనుంది.
గురుకుల నియామక ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పోస్టులు ఇవే..
డిగ్రీ కళాశాలల్లో 868 అధ్యాపక, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
జూనియర్ కళాశాలల్లో 2,008 లెక్చరర్లు, పాఠశాలల్లో ,1276 పీజీటీ, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్.
134 ఆర్ట్స్, 92 క్రాఫ్ట్, 124 మ్యూజిక్, 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ నెల 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్.. 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ తెలిపారు.
వివిధ సంక్షేమ పాఠశాలల్లో.. వేర్వేరుగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇందులో వయో పరిమితి.. విద్యార్హత, ఇతర వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.
గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు 4,020 ఉన్నాయి. ఈ నెల 28 నుంచి మే 27వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
వేతన స్కేలు రూ.42,300 నుంచి రూ.1,15,270వరకు ఉండనుంది.
డిగ్రీ కళాశాలల్లో మొత్తం 868 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వేతనం రూ.54,220 నుంచి రూ.1,33,630లుగా ఉంటుంది.
అలాగే జూనియర్ కళాశాలల్లో 2008 పోస్టులు ఉన్నాయి. వేతనం రూ. 54.220 నుంచి 1.33.630లుగా ఉంటుంది.
పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్ ఉద్యోగాల్లో మొత్తం 1,276 పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరించనున్నారు.
ఇందులో పోస్టులకు వేతనం రూ.45,960 నుంచి రూ.1,24,150గా ఉంటుందని పేర్కొన్నారు.