Site icon Prime9

Guntur West: రెబల్స్ బెడద.. సొంత పార్టీలో నేతల కుమ్ములాట!

Guntur West Politics in Andhra Pradesh: ఆ జిల్లాలో‌‌ ఓ నియోజకవర్గం అనధికారికంగా మైనార్టీ‌ నియోజకవర్గం. ఏ పార్టీ ఐనా సరే..మైనార్టీలనే అభ్యర్థులుగా ప్రకటించడం అక్కడ ఆనవాయితీ. టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించినా సొంత పార్టీలో నేతల కుమ్ములాటతో సతమతమౌతున్నాడు. స్ట్రీట్ ఫైటింగ్స్ కూడా తప్పడంలేదట. మరోవైపు ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి..తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో అంతా తల పట్టుకుంటున్నారంట. నియోజకవర్గంలో నేతల‌తీరు ఎవరికి వారే యమునాతీరే‌ అన్నట్లుగా ఉందట.

గుంటూరు తూర్పు నియోజకవర్గం పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతం అందుకే టీడీపీ, వైసీపీ పార్టీ ఏదైనా సరే సీటు మాత్రం మైనార్టీలకే కేటాయిస్తాయి. 2014, 2019 ఎన్నికలలో వరుసగా వైసీపీ అభ్యర్థి ముస్తాఫా విజయం సాధించారు. 2024 ఎన్నికలలో ముస్తఫా తన కూమార్తెను నూరీ ఫాతిమాను రంగంలోకి దింపారు. నూరీ ఫాతిమా టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ చేతిలో ఓడిపోయారు. దీంతో ప్రస్థుత ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ 2019కి ముందు వైసీపీలో ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో టీడీపీలోకి రావడం తూర్పు స్థానానికి అభ్యర్థిగా పోటీ చేసి ముస్తాఫా చేతిలో‌ పరాజయం పొందారు. ఆయితే పార్టీని వీడకుండా ట్రావెల్ చేశారు. ఇదే సీటును అశిస్తూ నజీర్ అహ్మద్ కంటే ముందు పార్టీలో జాయిన్ అయిన ముజీబ్ సొంత పార్టీలో ప్రత్యర్థిగా మారారు. 2019లో సీటుకోసం వజీర్ అహ్మద్తో ముజీబ్ పోటీ పడ్డారు. నజీర్ అహ్మద్ ఓటమి పాలైన తర్వాత సైలెంట్గా ఉండి 2024లో సీటు కోసం పోటీ పడ్డారు. వార్డులలో విస్త్రత ప్రచారం చేశాడు ముజీబ్. ఈ సందర్బంలో ఒకసారి ఇరువర్గాలు ఎదురై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. చివరికి ఈ పంచాయితీలో అధిష్టాన పెద్దలు కలుగచేసుకోవడంతో‌ వివాదం కాస్తా సద్దు మణిగింది. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా ముజీబ్, నజీర్ అహ్మద్ ఉన్నారు. నజీర్కు ఈసారి సీటు ఇవ్వకపోవచ్చు అన్న టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే ఎంపీ అభ్యర్థిగా వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్..నజీర్ అహ్మద్కు అండగా నిలబడటంతో అధిష్టానం సీటును కేటాయించింది. జీర్ అహ్మద్ వైసీపీ అభ్యర్థి ముస్తాఫా కుమార్తె నూరీ ఫాతీమాపై విజయం సాధించారు.

అయితే విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి నజీర్కు ఓడిపోయిన ఫాతిమాకు రెబల్స్ బెడద తప్పడంలేదట. నియోజకవర్గానికి చెందిన ముజీబ్..టికెట్ కోసం చివరి వరకూ ప్రయత్నాలు చేశారు. అయితే ఎన్నికలు పూర్తయి 8 నెలలు గడవక ముందే ఏకంగా ముజీబ్ వర్గం ఎమ్మెల్యేపైనే దాడి చేయడం కలకలం రేపింది. ఎమ్మెల్యేగా గెలిచిన నసీర్ ప్రత్యర్ధి వర్గాన్ని పట్టించుకోవడం లేదన్న వాదన తెరపైకి తీసుకొచ్చారు. తమకు కార్యక్రమాల గురించి చెప్పటంలేదని..పార్టీ సమావేశాలకు ఆహ్వనించడంలేదని ముజీబ్ వర్గం అంటోంది. ఇందులో భాగంగానే తూర్పు నియోజకవర్గంలోని 1వ డివిజన్లో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే నజీర్ వెళ్లారు. అయితే ఆ డివిజన్..టిడిపి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో ఉన్న ముజీబ్ సోదరులు ఇంతియాజ్, పైరోజ్ ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. తమకు తెలియకుండా ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. ప్రశ్నించడమే కాకుండా ఏకంగా ఎమ్మెల్యే నసీర్పై ఇంతియాజ్, ఫైరోజ్ మరో ముగ్గురు దాడి చేశారు. పోలీసులు వెంటనే స్పందించి టిడిపి నేతల్ని అక్కడ నుండి బయటకు పంపించివేశారు. అనంతరం బోస్ జయంతి వేడుకలను ఏర్పాటు చేసిన శైలజ ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. అయితే ముజీబ్ వర్గంతో ఎప్పటినుండో విభేధాలుండటం అవి ఒక్కసారిగా బయటపడంతో అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. 20 ఏళ్ల తర్వాత ఇక్కడ టిడిపి అభ్యర్ధి విజయం సాధించారు. అయితే దాన్ని కాపాడుకోవాల్సింది పోయి వర్గాలుగా విడిపోవడంపై తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక అధికార పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రతిపక్ష పార్టీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదనే టాక్ విన్పిస్తోంది. వైసిపి ఇంఛార్జ్ గా ఉన్న నూరి ఫాతిమాను మార్చాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ నేత వైవి సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. గుంటూరు అర్భన్ అధ్యక్ష స్థానం కోసం ఫాతిమా పట్టు బడుతుండటంతో ప్రత్యర్ధి వర్గం..ఆమె ఇంఛార్జ్ కే చెక్ పెట్టింది. ఈ వివాదం వైసిపి కార్యకర్తల్లోనూ ఆందోళన కలిగించింది. అయితే రెండు పార్టీల్లోనూ మొదలైన అసంత్రుప్తి ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా లేదని ఇరు పార్టీల కార్యకర్తలు వాపోతున్నారట. ఇప్పటికైనా రెండు పార్టీల అధిష్టానం…ఏ మేరకు చర్యలు తీసుకొని అసంత్రుప్తులను సర్ధుబాటు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Exit mobile version