Site icon Prime9

Amarnath Yatra :అమర్‌నాథ్ యాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్.. తాను, కుటుంబం సేఫ్ అంటూ వీడియో విడుదల

అమర్‌నాథ్ యాత్రలో పోటెత్తిన  వరద కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోగా, 40 మంది దాకా గల్లంతైనట్లు సమాచారం. అమర్‌నాథ్ యాత్రకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన కుటుంబంతో కలిసి వెళ్లారు. ఆయన, తన కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లు రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. వారిని అక్కడి పోలీసులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలిపారు.

ఇటీవల తన కుమార్తె వివాహం జరిగడంతో కుమార్తె, అల్లుడితో పాటు 11 మంది కుటుంబ సభ్యులతో ఈనెల 6న అమర్‌నాథ్‌ యాత్ర కోసం హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు రాజాసింగ్ వాతావరణం అనుకూలించక హెలికాప్టర్‌ రద్దు కావడంతో ఢిల్లీ నుంచి అతికష్టం మీద గురువారం సాయంత్రం పంచతరణికి చేరుకున్నామన్నారు. రాత్రి అక్కడ ఓ టెంట్‌లో నిద్రించి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు గుర్రాల పై అమర్‌నాథ్‌కు చేరుకున్నామని రాజాసింగ్ వెల్లడించారు.

Exit mobile version