Tslprb: పోలీస్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్.. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ కీలక నిర్ణయం

Tslprb: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులకు పోలీస్ నియామక బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ప్రాథమిక పరీక్ష ఫలితాలపై తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫలితాల విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది.

Tslprb: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులకు పోలీస్ నియామక బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ప్రాథమిక పరీక్ష ఫలితాలపై తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్
బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫలితాల విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది.

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్. ప్రాథమిక పరీక్ష ఫలితాలపై పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రిలిమ్స్‌లో 7 ప్రశ్నల విషయంలో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అందిరికి మార్కులు కలపాలని సూచించింది.

ప్రాథమిక పరీక్ష మల్టిపుల్‌ ప్రశ్న విషయంలో అందరికీ మార్కులు కలపాలని హైకోర్టు High Court ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలని ఈ మేరకు బోర్డు (Tslprb) నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఉత్తీర్ణులైన అభ్యర్ధులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్రాథమిక పరీక్ష సమయంలో ఉన్న హాల్‌ టికెట్ నంబర్లతో లాగిన్‌ అయ్యేందుకు అవకాశం కల్పించనున్నారు.

ఈ నిర్ణయంతో.. ఈనెల 30 నుంచి అభ్యర్ధులు వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి అప్లికేషన్ సబ్ మిట్ చేయాలని సూచించారు.

దేహదారుఢ్య పరీక్ష కోసం పార్ట్‌-2 ను సమర్పించాలని పోలీసు నియామక బోర్డు పేర్కొంది.

ఇదివరకే ప్రిలిమినరీలో ఉత్తీర్ణులై దేహదారుఢ్య పరీక్షలు పూర్తి చేసుకున్న వారికి అవసరం లేదన్నారు.

దేహదారుఢ్య పరీక్షలో ఫెయిలైన వారి గురించి.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పోలీస్ నియామక బోర్డు తెలిపింది.

కోర్టు ఆదేశాల మేరకు.. ఉత్తీర్ణులైన వారు ఫిబ్రవరి 1న ఉదయం 8గంటల నుంచి 5వ తేదీ రాత్రి 10గంటల వరకు పార్ట్‌-2 అప్లికేషన్‌ సమర్పించవచ్చు.

ఫిబ్రవరి 8 ఉదయం 8గంటల నుంచి 12వ తేది రాత్రి 10గంటల వరకూ దేహదారుఢ్య పరీక్షల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.

ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

ఈ నిర్ణయంతో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/