Site icon Prime9

Marburg virus: ఆఫ్రికాలో మరో ప్రాణాంతక వైరస్‌ ‘మార్బర్గ్‌’

Marburg virus:మానవాళి పై ప్రాణాంతక వైరస్‌లు దాడి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న వేళ. ఆఫ్రికాలో మరో ప్రమాదకర వైరస్‌ బయటపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఆఫ్రికాలోని ఘనా దేశంలో చాలా ప్రాణాంతకమైన ‘మార్బర్గ్‌’ వైరస్‌ వెలుగులోకి వచ్చింది. మొదటి రెండు కేసులను ఆదివారం ఘనా అధికారికంగా ధృవీకరించింది. ఇటీవల మరణించిన ఇద్దరు రోగులకు పరీక్షలు నిర్వహించగా ప్రాణాంతక వైరస్‌ నిర్ధరణ అయినట్లు పేర్కొంది. పశ్చిమ ఆఫ్రికా దేశంలోని ఆరోగ్య అధికారులు బాధితులతో కలిసిన 98 మందిని ఐసోలేషన్‌కు తరలించామని, ఎవరిలోనూ వైరస్‌ లక్షణాలు కనిపించలేదని పేర్కొంది.

ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్‌ కేసులు వెలుగు చూడటం రెండోసారి. గినియాలో గత ఏడాది తొలి కేసు నమోదైంది. మళ్ళీ ఇప్పుడు మరోసారి ‘మార్బర్గ్‌’ వైరస్‌ వెలుగులోకి వచ్చింది.ఈ వైరస్ కు చికిత్స లేదు. అయితే ఎక్కువగా నీరు త్రాగడం, లక్షణాలకు సంబధించిన చికిత్స తీసుకోవడం ద్వారా రోగి ఆరోగ్యాన్ని మెరుగు పరచవచ్చని వైద్యులు తెలిపారు. ‘మార్బర్గ్‌’ వైరస్‌ గబ్బిలాల నుండి వ్యాపిస్తుంది మరియు శరీర ద్రవాల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.

డబ్ల్యూహెచ్‌ఓ ..
WHO ప్రాణాంతక మార్బర్గ్‌ వైరస్‌పై అప్రమత్తమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్‌. డబ్యూహెచ్‌వో ఆఫ్రికా రీజనల్‌ డైరెక్టర్‌ మాట్షిడిసో మోటీ ఘనా దేశ ఆరోగ్య విభాగం వేగంగా స్పందించింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంది లేదంటే మార్బర్గ్‌ వైరస్‌ చేయిదాటిపోతుంది అని పేర్కొన్నారు. మార్బర్గ్‌ వైరస్‌ సోకిన ఇద్దరు రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందే ముందు, వారిలో డయేరియా, శరీరంలో రక్త స్రావం, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయన్నారు.

Exit mobile version