Site icon Prime9

Minister KTR: టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల

Former MLA Nallala joined TRS

Former MLA Nallala joined TRS

Nallala Odelu: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొన్నారు. ఆయనతోపాటు తన భార్య, మంచిర్యాల జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ భాగలక్ష్మీతో సహా మంత్రి కేటిఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. కండువా కప్పి వారిని పార్టీలోకి కేటిఆర్ వారిని ఆహ్వానించారు.

కొన్ని రోజుల క్రితం నల్లాల ఓదెలు టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. తాజాగా మంత్రి కేటిఆర్ సమక్షంలో తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేశారు. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి చెన్నూరు నియోజకవర్గం నుండి ఓదెలు గెలుపొందారు.

2023 అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఏ పార్టీలో ఏ నేత ఉంటారో తెలియని పరిస్ధితి తెలంగాణాలో ఏర్పడింది. మరో వైపు మునుగోడు ఉప ఎన్నిక నేపధ్యంలో కాంగ్రెస్, భాజపా పార్టీ నేతలను మానసికంగా కుంగదీసే ఆలోచనలో భాగంగానే పలువురు నేతల్ని టీఆర్ఎస్ లో చేర్చుకొంటున్నారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం జంప్ జిలానీల కహానీ మరింత ఏర్పడనుంది.

ఇది కూడా చదవండి:CM KCR:  ప్రగతి భవన్ లో ఆయుధ పూజ

Exit mobile version