Kites In Hyderabad: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. చిన్న పెద్దా అందరు గాలిపటాలు ఎగరేస్తూ పండగ చేసుకుంటారు. ఈ సారి మాత్రం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, రోడ్లు, ప్రార్థన స్థలాలపై గాలిపటాలు ఎగరవేయడాన్ని నిషేధించారు.
నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ నిషేదం జనవరి 14 ఉదయం నుంచి జవనరి 16 ఉదయం వరకు అమలులో ఉంటుందని తెలిపారు. కావున ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని సీపీ సీపీ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.
కైట్స్ ఏ కాదు పాటలు పెట్టినా అంతే సంగతి..
గాలిపటాలతో పాటు.. మరికొన్నింటిని నిషేధిస్తున్నట్లు తెలిపారు.
కాలుష్య నియంత్రణ చట్టం ప్రకారం.. లౌడ్ స్పీకర్లు, డీజేలను అనుమంతించడం లేదని తెలిపారు.
ఎవరైనా పోలీసుల అనుమతి లేకుండా వీటిని వినియోగిస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మరోవైపు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా.. ప్రసంగాలు, పాటలు పెడితే వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
అనుమతులు తీసుకున్నాకే వాటి పరిధికి లోబడి స్పీకర్లు పెట్టుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో పగటి సమయంలో 65.. రాత్రి సమయంలో 55 కన్నా తక్కువ డెసిబుల్ సౌండ్ పెట్టుకోవాలని తెలిపారు. నివాస ప్రాంతాల్లో రాత్రి, పగలు 55 డెసిబుల్ మాత్రమే ఉండాలని సూచించారు. ఎంపిక చేసిన ప్రాంతాలు లేదా సైలెంట్ జోన్ లో 40 డెసిబుల్స్ మించకూడదని పేర్కొన్నారు.
ఇక గాలిపటాలు ఎగరవేసే సమయంలో పిల్లలను గమనించాలని.. తల్లిదండ్రులకు సూచించారు. వారిని పర్యవేక్షిస్తూ ఉండాలని ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రహరీ గోడలు లేని డాబాలు.. విద్యుత్ తీగలు దగ్గరికి ఉండే డాబాలపైకి పిల్లలను అనుమతించవద్దని తెలిపారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/