Site icon Prime9

FBI: ట్రంప్‌ నివాసం నుంచి రహస్య పత్రాలు స్వాధీనం చేసుకున్న ఎఫ్‌బీఐ

Florida: ఈ వారం ప్రారంభంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫ్లోరిడా నివాసం పై ఎఫ్‌బీఐ ఏజెంట్లు సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 సెట్ల క్లాసిఫైడ్‌ డాక్యుమెంట్లతో పాటు కొన్ని టాప్‌ సీక్రెట్‌ దస్ర్తాలు కూడా ఉన్నట్లు జస్టిస్‌ డిపార్టుమెంటు నిన్న వెల్లడించింది. ఎఫ్‌బీఐ ఏజెంట్లు ట్రంప్‌ నివాస భవనంపై దాడులు చేసిన నాలుగు రోజుల తర్వాత ఈ వివరాలు బయటపెట్టింది. లీగల్‌ డాక్యుమెంట్లను బహిరంగ పర్చింది. కాగా ట్రంప్‌ గూడచర్యం చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంది. ఎఫ్‌బీఐ ట్రంప్‌ నుంచి మొత్తం 30 ఐటెంలు. వాటిలో 20 బాక్సులు, ఫోటోలు, చేతిరాత నోటులు తదితరాలు ఉన్నట్లు ఎఫ్‌బీఐ వెల్లడించింది.

ఇదిలా ఉండగా ట్రంప్‌ రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయి వైట్‌ హౌస్‌ను ఖాళీ చేసినప్పుడు దేశ రహస్య పత్రాలను తన వెంట తీసుకువెళ్లారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎఫ్‌బీఐ ఫ్లోరిడాలోని నివాసంతో సోదలు జరిపింది. దీనిపై ట్రంప్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోదాలు రాజకీయ ప్రేరితమైనవిగా ఆరోపించారు. 2024 అధ్యక్ష పదవి పోటీపడాలనుకుంటున్న ట్రంప్‌కు ఇది గట్టి దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version