Site icon Prime9

సీవీ ఆనంద్‌ డీపీతో వాట్సాప్‌ కాల్స్‌ – కొత్త అవతారం ఎత్తిన సైబర్‌ నేరగాళ్లు

Fake Whatsapp Calls on CV Anand Name: రోజురోజుకి సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫేక్‌ ఫోన్‌ కాల్స్‌తో ప్రజలను భయపెడుతున్నారు. ఈ క్రమంలో వారు రోజుకో అవతారం ఎత్తున్నారు. తాజాగా ఈ సైబర్‌ నేరగాళ్లు ఏకంగా పోలీసు కమిషనర్‌ అవతారం ఎత్తారు. హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌(సీపీ) సీవీఆనంద్‌ డీపీతో వాట్సప్‌ కాల్‌ చేస్తూ ప్రజలను భయపెడుతున్నారు. పాకిస్తాన్‌ దేశ కోడ్‌తో వాట్సాప్‌కాల్స్‌ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో దీనిపై స్వయంగా సీపీ స్పందించారు. సైబర్‌ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ మధ్య సైబర్‌ నేరగాళ్లు అక్రమ కేసుల పేరిట ఫేక్‌ వాట్సాప్‌కాల్స్‌ చేసి ప్రజల దగ్గర డబ్బులు వసూళ్లు చేస్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. డిజిటల్‌ ఆరెస్టులతో పాటు కేసులు రిజస్టర్‌ అవ్వడం, ఫోన్‌ కనెక్షన్‌ను ట్రాయ్‌ కట్‌ చేయడం తదితర కారణాలు చెప్పి ప్రజలను భయపెడుతున్నారు.

Exit mobile version